హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube Go: యూట్యూబ్ గో లైట్‌వెయిట్ యాప్‌ సేవలు బంద్.. ఆగస్టు నుంచి పనిచేయదని చెప్పిన సంస్థ..

YouTube Go: యూట్యూబ్ గో లైట్‌వెయిట్ యాప్‌ సేవలు బంద్.. ఆగస్టు నుంచి పనిచేయదని చెప్పిన సంస్థ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించే YouTube Go యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో యూట్యూబ్ గో వినియోగదారులందరూ తమ డివైజ్‌లలో రెగ్యులర్ యూట్యూబ్ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించాలని బుధవారం సంస్థ సలహా ఇచ్చింది.

యాప్ డెవలపర్లు(App Developers) తమ అప్లికేషన్ యూజర్ బేస్‌ను(Application User Base) పెంచేందుకు అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. హై ఎండ్(High End), లో ఎండ్ డివైజ్‌ యూజర్లకు(Devise Users) సేవలు అందించేలా ప్రణాళికలు(Planes) వేసుకుంటారు. ఒకవేళ యాప్‌ను(App) అన్ని వర్గాల వారికి చేరువ చేయలేకపోతే.. అవే సేవలను తక్కువ ఫీచర్లతో అందించేందుకు మరో యాప్‌ను డెవలప్ చేస్తారు. వీటిని సెకండరీ, లైట్ వెయిట్ యాప్స్ అంటారు. గూగుల్ కూడా యూట్యూబ్ (YouTube) యాప్‌ సేవలను పూర్తి స్థాయిలో యాక్సెస్ చేయలేని వారి కోసం యూట్యూబ్ గో (YouTube Go) పేరుతో ఒక లైట్ వెయిట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీని సేవలను త్వరలో నిలిపివేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించే YouTube Go యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో యూట్యూబ్ గో వినియోగదారులందరూ తమ డివైజ్‌లలో రెగ్యులర్ యూట్యూబ్ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించాలని బుధవారం సంస్థ సలహా ఇచ్చింది. తాజా పోస్ట్ ప్రకారం.. యూట్యూబ్ గో సేవలు ఈ సంవత్సరం ఆగస్టు వరకు అందుబాటులో ఉంటాయి. గూగుల్ 2016లో యూబ్యూబ్ గో యాప్‌ను లాంచ్ చేసింది. లో ఎండ్ డివైజ్ యూజర్లకు స్ట్రీమింగ్ సేవలు అందించేందుకు కామెంట్‌లు, కంటెంట్‌ క్రియేషన్, డార్క్ మోడ్‌కి మారడం.. వంటి ఫీచర్‌లు లేని ఈ యాప్‌ను లాంచ్ చేసింది. కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉండే ఇండియా వంటి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని దీన్ని రూపొందించారు.

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


ఒకప్పుడు నెట్‌వర్క్ డేటా కాస్ట్ ఎక్కువగా ఉండేది. దీంతో వీడియో స్ట్రీమింగ్ కోసం ఖర్చు ఎక్కువయ్యేది. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యలు లేనందువల్ల.. గో వెర్షన్ యూజర్లను రెగ్యులర్ యూట్యూబ్ వాడేలా ప్రోత్సహించాలని కంపెనీ నిర్ణయించింది. దీంతోపాటు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించగలిగేలా మెయిన్ యాప్‌ను తీర్చిదిద్దుతోంది. ఇలా గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినందువల్ల, యూట్యూబ్ గో యాప్‌ను షట్‌డౌన్ చేసి, మెయిన్ యాప్‌ను స్టెబుల్‌గా ఉంచడం, పనితీరును మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ గో యాప్ కూడా Android Go ఎకో సిస్టమ్‌లో భాగమే. అయితే ఆగస్టు తర్వాత Android Go స్మార్ట్‌ఫోన్‌లలో యూట్యూబ్ గో వెర్షన్‌ను అందిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై యూట్యూబ్ స్పందించాల్సి ఉంది. ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫారమ్‌ను లో-ఎండ్ డివైజ్‌ల కోసం సృష్టించారు. 1GB లేదా 2GB RAMతో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో సేవలు అందించడమే ఈ లైట్ ఓఎస్ లక్ష్యం. అయితే ఈ రోజుల్లో చాలా డివైజ్‌లు పెద్ద ర్యామ్ ఆప్షన్లతో వస్తున్నాయి. దీంతో లైట్ వెయిట్ యాప్‌లపై కంపెనీల ఆలోచన మారుతోంది.

First published:

Tags: 5g technology, Technology, Youtube

ఉత్తమ కథలు