హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube: సైలెంట్‌గానే ఆ పని కానిచేస్తున్న యూట్యూబ్.. యూజర్లపై ప్రభావం!

YouTube: సైలెంట్‌గానే ఆ పని కానిచేస్తున్న యూట్యూబ్.. యూజర్లపై ప్రభావం!

YouTube: సైలెంట్‌గానే ఆ పని కానిచేస్తున్న యూట్యూబ్.. యూజర్లపై ప్రభావం! (ప్రతీకాత్మక చిత్రం)

YouTube: సైలెంట్‌గానే ఆ పని కానిచేస్తున్న యూట్యూబ్.. యూజర్లపై ప్రభావం! (ప్రతీకాత్మక చిత్రం)

YouTube Premium | యూట్యూబ్ సైలెంట్‌గానే కొత్త ఫార్మాట్‌ను అమలు చేస్తోంది. దీని వల్ల యూట్యూబ్ ఉచిత యూజర్ల పైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీ ఏ ఫార్మాట్ తీసుకువచ్చిందో ఒకసారి తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  YouTube Video Ads | యూట్యూబ్ చూడని వారు ఉండరు. ప్రతి రోజూ కచ్చితంగా యూట్యూబ్‌ను చూసే వారు కోట్లలో ఉంటారు. ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్‌ను (YouTube) చెప్పుకోవచ్చు. గూగుల్‌కు (Google) చెందిన యూట్యూబ్ కొత్త ఫార్మాట్‌ను సైలెంట్‌గా అమలులోకి తీసుకువచ్చింది. 2022 సెప్టెంబర్ నెలలోనే కొత్త ఫార్మాట్‌ను తీసుకువచ్చింది. దీంతో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకొని కస్టమర్లకు ఇకపై వీడియో చూడాలంటే ముందు ఐదు అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించనున్నాయి.

  కొత్త ఫార్మాట్‌ అమలు గురించి తెలియని యూట్యూబ్ కస్టమర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. 2 యాడ్స కాకుండా 5 యాడ్స్ వస్తున్నాయని పేర్కొంటున్నారు. యూట్యూబ్‌లో వీడియో చూడటానికి ముందే ఈ యాడ్స్ కనిపిస్తున్నాయని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వీటిని స్కిప్ చేయడానికి కూడా వీలు లేదని నెటిజర్లు పేర్కొంటున్నారు. గతంలో అయితే స్కిపబుల్ ఆప్షన్ అందుబాటులో ఉండేదని తెలియజేస్తున్నారు.

  గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

  యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ అంశానికి సంబంధించి యూట్యూబ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చింది. ఐదు యాడ్స్ అంశాన్ని అయితే ధ్రువీకరించింది. కంపెనీకి సంబంధించిన బంపర్ యాడ్స్ ఫార్మాట్ వల్ల ఇలా జరిగిందని తెలిపింది. ఇవి సాధారణంగా 6 సెకన్ల పాటు వస్తాయి. అలాగే ఈ తరహా యాడ్స్‌ను స్కిప్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. స్కిప్ చేసే ఆప్షన్ లేకపోతే కస్టమర్లకు అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.  యూట్యూబ్ ఉచిత యూజర్లు అందరికీ ఈ సమస్య లేదు. వీడియో ప్రారంభానికి  ముందు అందరికీ ఐదు యాడ్స్ కనిపించడం లేదు. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్‌ ఫ్రీ యూజర్లు కేవలం వీడియో చూసేటప్పుడు రెండు యాడ్స్‌నే గమనిస్తున్నారు. కొంత మంది యూజర్లక మాత్ర ఇలా ఐదు యాడ్స్ కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే రానున్న కాలంలో ఉచిత యూజర్లు అందరికీ ఇదే పరిస్థితి ఎదురు కానుంది.

  ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త.. వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

  ఇకపోతే యూట్యూబ్ మాత్రం ఒక విషయాన్ని పదే పదే తెలియజేస్తోంది. ఉచిత కస్టమర్లు కానీ, లేదంటే ప్రీమియం యూజర్లు కానీ ఎవరైనా సరే యూట్యూబ్ యాడ్ పాలసీకి సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని పేర్కొంటోంది. కంపెనీకి నేరుగా ఫీడ్ బ్యాక్ చేరవేయవచ్చని తెలియజేస్తోంది. సెండ్ ఫీడ్ బ్యాక్ టూల్ ద్వారా కస్టమర్లు వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొంది.  అందువల్ల మీరు ఈ కొత్త అంశంపై ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేదంటే ఫిర్యాదులు ఉన్నా మీరు యూట్యూబ్‌కు నేరుగా తెలియజేయవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Videos, Youtube

  ఉత్తమ కథలు