సోషల్ మీడియా(Social Media) విస్తృతితో ఎన్ని లాభాలున్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పడు అసలు వార్తలకంటే నకిలీ వార్తలే (Fake News) రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు వాటిల్లుతున్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నకిలీ వార్తలు నిజమేనని నమ్మి చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వాలు పెట్టుకున్న వ్యాక్సిన్ టార్గెట్ అందుకోవడం కష్టతరంగా మారింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జులైలో మీడియాకు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా టీకాల విషయంలో ప్రజలకు సందేహాలకు ఎక్కువయ్యాయని, అటువంటి ఛానళ్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
అంతేకాదు, ఈ ఫేక్ వార్తల వలలో పడి కరోనా విజృంభనలో బాగస్వామ్యం కావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube Latest Telugu News) సైతం కరోనా వాక్సిన్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై నిషేధం విధించింది. గత సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు130,000 వీడియోలను తొలగించింది.
ఈ మేరకు యూట్యూబ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ ట్రస్ట్ సేఫ్టీ అధికారి మాట్ హాల్ ప్రిన్ ధృవీకరించారు. కాగా, ప్రముఖ అల్ఫాబెట్ అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీకి సంబంధించిన ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ కోవిడ్ వ్యాక్సిన్లకు విరుద్దంగా తప్పుడు సమాచారం ఇస్తున్న ఉద్యోగులను శాశ్వతంగా తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఫేస్బుక్, ట్విట్టర్ సైతం అదే బాటలో..
కాగా, కోవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిలో రాబర్ట్ ఎఫ్.కెన్నడీ, జోసెఫ్ మెర్కోలా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రముఖ సోషల్‌మీడియా మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ఇలాంటి వీడియోలకు మద్దతు ఇస్తున్నాయే తప్ప వాటిని అడ్డుకోవడం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై చర్యలు తీసుకుంది యూట్యూబ్. ఇక, యూట్యూబ్ తరహాలోనే ఫేస్బుక్, ట్విట్టర్ సైతం టీకాల గురించి తప్పుడు సమాచారాన్ని పంచుకునే వినియోగదారులను ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధిస్తున్నట్లు పేర్కొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Fake news, Joe Biden, Technology, Youtube