సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కి చెందిన యూట్యూబ్ సహా ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై జరిగే అనధికారిక అప్‌లోడ్‌లపై కాపీరైట్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అనధికారిక అప్‌లోడ్‌లను అడ్డుకునేందుకు ఆయా వ్యక్తులకు జరిమానా విధించే అంశాన్ని YouTube పరిశీలిస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు చట్టవిరుద్ధమైన అప్‌లోడ్‌ల గురించి తెలుసుకున్నప్పటికీ వారికి యాక్సెస్ లేకుండా చర్యలు తీసుకోకపోతే ఆయా సంస్థలే బాధ్యత వహిస్తాయని జర్మనీ ఉన్నత న్యాయస్థానం గురువారం తన తీర్పులో పేర్కొంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా అనధికారిక/చట్టవిరుద్ధమైన/ ద్వేషపూరిత కంటెంట్ పోస్ట్ చేయడంపై ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై విస్తృత చర్చలో భాగంగా ఈ తీర్పు వెలువడింది. ఐరోపాలో ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ పరిశ్రమకు సంబంధించి క్రియేటివ్ ఇండస్ట్రీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సుదీర్ఘ పోరాటం జరుగుతూ వస్తోంది. అనధికార అప్‌లోడ్‌ల అంశంపై గతంలోనే ఐరోపా సమాఖ్య పరిహారం కోరింది. ప్రస్తుత తీర్పు ప్రకారం అప్‌లోడ్ ప్లాట్‌ఫామ్‌ల ఆపరేటర్‌లు ఉల్లంఘనలకు పాల్పడే వినియోగదారుల గుర్తింపును, వారి మెయిల్ చిరునామాలను బహిర్గతం చేయవలసి ఉంటుంది.
గురువారం నాటి తీర్పులో.. ఒక ఆర్టిస్ట్‌కి చెందిన ఆడియో/ వీడియో రికార్డింగ్‌లు YouTubeలో అందుబాటులో ఉన్నట్లయితే దానికి యూట్యూబ్ బాధ్యత వహించాలా? లేదా? అనే దానిపై కోర్టు తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే నూతన మార్గదర్శకాల ఆధారంగా కేసు పునః పరిశీలన కోసం దిగువ కోర్టులకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తీర్పు నేపథ్యంలో యూట్యూబ్ స్పందించింది. కాపీరైట్ ఉల్లంఘనపై పోరాడేందుకు, హక్కులను కలిగి ఉన్నవారు వాటాలు పొందేలా చూసేందుకు తాము రూపొందించిన విధివిధానాలపై నమ్మకం ఉందని YouTube ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు.. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)ను దేశ వ్యాప్తంగా కోట్లాది మంది యూజ్ చేస్తున్నారు.
దీంతో స్కామర్ల (Scammers) కన్ను వాట్సాప్‌పై పడింది. అమాయక యూజర్లు బురిడీ కొట్టించి అందినకాడికి దోచేద్దామని ఈ కేటుగాళ్లు వాట్సాప్‌లో సరికొత్త స్కామ్‌లకు తెరలేపుతున్నారు. అయితే ఇప్పుడు గతంలో వాట్సాప్‌లో కలకలం సృష్టించిన ఒక ఓల్డ్ స్కామ్ (Old Scam) మళ్లీ హల్చల్ చేస్తోంది. లాటరీ (Lottery) గెలుచుకున్నారని ఆశ చూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ఈ ప్రమాదకర స్కామ్‌తో యూజర్లు జాగ్రత్త వహించాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోసం చేసి, డబ్బును దొంగిలించాలనే దురుద్దేశంతో రూ.25 లక్షల విలువైన లాటరీ గెలుచుకున్నారని పేర్కొంటూ యూజర్లకు స్కామర్లు మెసేజ్ పంపుతారని టెక్ ఎక్స్‌పర్ట్స్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube, Youtube channel