హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube: యూట్యూబ్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి వీడియోస్‌లో ఓవర్‌లే యాడ్స్‌కు చెక్..!

YouTube: యూట్యూబ్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి వీడియోస్‌లో ఓవర్‌లే యాడ్స్‌కు చెక్..!

YouTube:  యూట్యూబ్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి వీడియోస్‌లో ఓవర్‌లే యాడ్స్‌కు చెక్..!

YouTube: యూట్యూబ్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి వీడియోస్‌లో ఓవర్‌లే యాడ్స్‌కు చెక్..!

YouTube: యాడ్ పాలసీ రివ్యూలో భాగంగా యూట్యూబ్‌ 2023 ఏప్రిల్ 6 నుంచి ఓవర్‌లే యాడ్స్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యూయర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడం, డెస్క్‌టాప్‌లు, మొబైల్ డివైజ్‌లలో హయ్యర్ పర్ఫార్మెన్స్‌ గల యాడ్‌ ఫార్మాట్‌లకు డిమాండ్‌ క్రియేట్‌ చేయడానికి యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గూగుల్‌ (Google)కి చెందిన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారం యూట్యూబ్‌ (YouTube), రెవెన్యూ కోసం ప్రధానంగా యాడ్స్‌పైనే ఆధారపడుతుంది. ఈ యాడ్స్‌ ద్వారా వచ్చే మొత్తాన్నే కంటెంట్‌ క్రియేటర్స్‌కు అందజేస్తుంది. అయితే యాడ్ పాలసీ రివ్యూలో భాగంగా యూట్యూబ్‌ 2023 ఏప్రిల్ 6 నుంచి ఓవర్‌లే యాడ్స్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యూయర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడం, డెస్క్‌టాప్‌లు, మొబైల్ డివైజ్‌లలో హయ్యర్ పర్ఫార్మెన్స్‌ గల యాడ్‌ ఫార్మాట్‌లకు డిమాండ్‌ క్రియేట్‌ చేయడానికి యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

వీడియో ఓవర్‌లే యాడ్స్ అనేయి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు యూజర్లకు పాప్-అప్ కార్డ్‌లుగా కనిపిస్తాయి. ఇవి వ్యూయర్స్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఒకవేళ యూజర్‌ యాడ్‌పైన క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ నుంచి మరొక ప్లాట్‌ఫారంకు వెళ్లి, కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. దీని తొలగింపుతో ఇతర యాడ్‌ ఫార్మాట్‌లకు ఎంగేజ్‌మెంట్‌ షిఫ్ట్‌ అవుతుందని, క్రియేటర్‌లపై తక్కువ ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నామని యూట్యూబ్‌ పేర్కొంది.

* ఇతర యాడ్‌ ఫార్మట్‌లకు నో ఛేంజెస్‌

ఏప్రిల్ 6 నుంచి యూట్యూబ్‌ వీడియోస్‌లో ఓవర్‌లే యాడ్స్‌ కనిపించవు లేదా యూట్యూబ్‌ స్టూడియోలో యాడ్స్‌ను ఆన్ చేసినప్పుడు అవైలబుల్‌ యాడ్స్‌ ఫార్మాట్‌లో కూడా కనిపిందచని కంపెనీ తెలిపింది. అయితే ఇతర యాడ్ ఫార్మాట్‌లలో ఎలాంటి మార్పులు జరగడం లేదని యూట్యూబ్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్ పుష్ నేమ్.. ఎలా పనిచేస్తుందంటే!

* యూట్యూబ్‌ ఓవర్‌లే యాడ్స్‌ అంటే ఏంటి?

యూట్యూబ్‌ ఇన్-వీడియో ఓవర్‌లే యాడ్స్‌ వీడియోలో దిగువన కనిపిస్తాయి. యూజర్లకు పాప్-అప్ కార్డ్‌లుగా కనిపిస్తాయి. ఈ యాడ్స్‌ సింపుల్‌ టెక్స్ట్‌, ఇమేజెస్‌లా ఉంటాయి. వీటి పైభాగంలో ఉండే 'x' ఐకాన్‌పై క్లిక్ చేసి, యాడ్స్ క్లోజ్‌ చేయవచ్చు.

* యూట్యూబ్‌లో యాడ్స్‌ రకాలు

యూట్యూబ్‌లో వివిధ రకాల యాడ్స్ వ్యూయర్స్‌కు కనిపిస్తాయి. ప్లేస్‌మెంట్, ప్లాట్‌ఫారం, కంపాటిబిలిటీ, యాడ్‌ స్పెసిఫికేషన్‌ల పరంగా విభిన్నమైన యాడ్‌ ఫార్మాట్‌లను క్రియేటర్‌లకు యూట్యూబ్‌ అందిస్తుంది. ఫీచర్ వీడియో కుడి వైపున, వీడియో సజెషన్స్‌ లిస్ట్‌ పైన కనిపించే డిస్‌ప్లే యాడ్స్‌ ఉన్నాయి. స్కిప్పబుల్‌ వీడియో యాడ్స్‌ కూడా ఉంటాయి.

అవి మెయిన్‌ వీడియోలు మొదలయ్యే ముందు, వీడియో మధ్యలో లేదా వీడియో చివరిలో కనిపిస్తాయి. ఇతర నాన్‌ స్కిప్పబుల్‌ వీడియో యాడ్స్‌ కూడా ఉన్నాయి. ఇవి కూడా వీడియో మొదట్లో, మధ్యలో, చివర్లో ప్లే అవుతాయి. ఇవి 15 నుంచి 20 సెకండ్ల నిడివితో ఉంటాయి. వీటిని ఆరు సెకండ్లకు క్లోజ్‌ చేయవచ్చు. మరో రకం యాడ్‌లను స్పాన్సర్డ్‌ కార్డ్‌ అంటారు. ఇవి ప్రమోషనల్‌ కంటెంట్‌ను చూపుతాయి.

First published:

Tags: Google, Tech news, Youtube

ఉత్తమ కథలు