ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ (YouTube) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూ యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగు పరుస్తోంది. అయితే తాజాగా ఈ యాప్ తన ఇంటర్ఫేస్కు కొత్త లుక్, పించ్ టు జూమ్ (Pinch To Zoom) ఫీచర్, ప్రిసైస్ సీకింగ్ (Precise Seeking), న్యూ బటన్స్, యాంబియంట్ మోడ్ (Ambient Mode), మరింత డార్క్ కలర్‌తో డార్క్ మోడ్‌ను ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి ఈ సరికొత్త అప్డేట్లు క్రమంగా యూజర్లందరికీ రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ ఫీచర్లు యూజర్లకు ఎలా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం.
* యాంబియంట్ మోడ్
ప్రస్తుతం యూట్యూబ్‌లో "యాంబియంట్ మోడ్" అనే కొత్త కలర్ ఎఫెక్ట్ యూజర్లకు రిలీజ్ అవుతోంది. ఇది యాప్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను యూజర్ చూసే వీడియోలోని రంగులకు మ్యాచ్ చేస్తుంది. ఇందుకు డైనమిక్ కలర్ శాంప్లింగ్ని ఉపయోగిస్తుంది. ఈ కొత్త కలర్ ఎఫెక్ట్ చాలా చిన్నది. అలానే వీడియో స్క్రీన్ కింద లుక్‌ను అద్భుతంగా మారుస్తుంది.
వ్యూయర్లను వీడియో కంటెంట్‌లోకి లాగడమే ఈ ఎఫెక్ట్ ముఖ్య ఉద్దేశం. యూట్యూబ్ డార్క్ థీమ్ ఆన్ చేసిన డెస్క్‌టాప్, మొబైల్‌లలో ఈ యాంబియంట్ మోడ్ అందుబాటులో ఉంటుంది. ఇది వీడియో ప్లేలిస్ట్‌లలో కూడా ఉంటుంది. యూట్యూబ్ డార్క్ థీమ్‌ను కూడా అప్డేట్ చేసింది. ఈ థీమ్ వెబ్, మొబైల్ , స్మార్ట్ టీవీలలో రిలీజ్ అవుతోంది.
* పించ్ టు జూమ్
పించ్ టు జూమ్ ఫీచర్‌తో యూజర్లు వీడియోను సులభంగా జూమ్ ఇన్.. జూమ్ అవుట్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్‌కి అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ ఫీచర్ యూట్యూబ్‌లో చాలా కాలం నుంచే అందుబాటులో ఉంది. కాకపోతే ఓన్లీ ఒక వీడియోకి మాత్రమే జూమ్ అవుట్ అనేది అప్లై అయ్యేది. ఇప్పుడు మాత్రం ఒక్క వీడియోకి పించ్-టు-జూమ్ చేసినా.. ఆ జూమ్ అవుట్ అనేది అన్ని వీడియోలకు అప్లై అవుతుంది. మళ్లీ ఏదైనా యూట్యూబ్ వీడియోపై పించ్-టు-జూమ్ ఇన్ చేసేవరకు జూమ్ అవుట్ అలాగే ఉంటుంది.
కొత్త ఫీచర్‌తో చాలా ఈజీగా మిగిలిన వీడియోలన్నీ జూమ్ అవుట్ మోడ్‌లో మరిన్ని డీటెయిల్స్‌తో చూడవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించడానికి ఫుల్ స్క్రీన్ మోడ్‌లో రెండు వేళ్లతో వీడియో స్క్రీన్‌ను టచ్ చేస్తూ మీ వేళ్లను ఒకదానికొకటి దూరంగా కదిలించాలి. ఆపై వేళ్లను స్క్రీన్‌పై నుంచి తొలగించాలి.
ఇది కూడా చదవండి : ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ 3 ప్లాన్లతో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఓ లుక్కేయండి
* ప్రిసైస్ సీకింగ్
ప్రిసైస్ సీకింగ్ ఫీచర్ వీడియో విజువల్ టైమ్‌లైన్ చూడటానికి ఉపయోగపడుతుంది. యూజర్లు స్క్రీన్‌పై నొక్కి పట్టుకుని ఒక వీడియోలో వరుసగా ఏ సమయానికి ఏ సీను ఉందో చూసుకోవచ్చు. అంతేకాదు స్క్రీన్‌పై నొక్కి పట్టుకుని పైకి లేదా క్రిందికి స్వైప్ చేయడం వల్ల వీడియో ప్లేయర్లో థంబ్‌నెయిల్‌ల వరుస కనిపిస్తుంది. దీనివల్ల ప్రతి వీడియోలోని కచ్చితమైన పార్ట్‌ను ఈజీగా ప్లే చేసుకోవచ్చు.
* సబ్‌స్క్రైబ్ బటన్
చాలా ఏళ్లుగా యూట్యూబ్‌లో రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్‌స్క్రైబ్ బటన్ కూడా బ్లాక్ లేదా వైట్ కలర్‌కి చేంజ్ కానుంది. డార్క్ థీమ్ వాడేవారికి వైట్ కలర్లో.. వైట్ థీమ్ వాడే వారికి బ్లాక్ కలర్లో ఈ బటన్ కనిపించనుంది. ఈ బటన్ కాస్త పక్కన కనిపిస్తూ యూజర్లు ఈజీగా సబ్‌స్క్రైబ్ చేసుకునేలా సపరేటుగా కనిపించనుంది. పైన పేర్కొన్న ఫీచర్లు ఇప్పుడే రిలీజ్ కావడం మొదలు పెట్టాయి కాబట్టి అవి మీ ఫోన్‌కి ఇంకా రాకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. అలాగే షేర్, లైక్, సేవ్ బటన్స్ లొకేషన్ కూడా మార్చేసింది. ఈ బటన్స్ కొత్తగా వీడియోకి కాస్త కిందగా కనిపిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, New features, Tech news, Youtube