కంటెంట్ క్రియేటర్లకు మెరుగైన ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషిస్తోంది యూట్యూబ్ (Youtube). ఈ రోజుల్లో చాలా మంది ఔత్సాహికులు పూర్తి సమయం డబ్బు సంపాదనకు యూట్యూబ్‌ను ఒక సాధనంగా చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం తాజాగా ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం(YPP)ను ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హత పొందిన క్రియేటర్లు యూట్యూబ్ టూల్స్‌కు యాక్సెస్ పొంది, డబ్బు సంపాదించవచ్చు. ఈ జాబితాలో విశ్వవ్యాప్తంగా 20 లక్షలకు పైగా క్రియేటర్లు ఉన్నారు. గత మూడేళ్లుగా.. క్రియేటర్లు, కళాకారులు, మీడియా కంపెనీలకు 30 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించినట్టు యూట్యూబ్ కంపెనీ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. మానిటైజేషన్ ప్రోగ్రాం ద్వారా నూతన ఉద్యోగాల కల్పనకు, ఆర్థిక ఫలితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రెవిన్యూ గురించి మాట్లాడుతూ.. 2021 రెండో త్రైమాసికంలో యూట్యూబ్ 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా యూట్యూబ్ క్రియేటర్లకు, భాగస్వాములకు అధికంగా చెల్లించినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ప్లాట్‌ఫాంలో అత్యధిక సంపాదన కలిగిన క్రియేటర్ల వివరాలను సంస్థ షేర్ చేయలేదు.
* YPPలో ఎలా భాగమవుతారు..
యూట్యూబ్ భాగస్వామ్య ప్రోగ్రాంలో(YPP) క్రియేటర్లు భాగం కావడానికి.. పేజీ మెయిన్ థీమ్, ఎక్కువగా వీక్షించిన వీడియో, సరికొత్త వీడియోలు, వాచ్ లో అత్యధిక భాగం, వీడియో మెటా డేటాను సమీక్షకులు తనిఖీ చేస్తారని తెలిపింది. గణాంకాల పరంగా చూస్తే గత 12 నెలల్లో ఛానెల్‌కు కనీసం 1000 మంది సబ్ స్క్రైబర్లు, 4 వేల గంటల స్ట్రీమింగ్ సమయం ఉండాలని స్పష్టం చేసింది. యూట్యూబ్ తన విధానాలకు అనుగుణంగా లేని ఛానెల్స్ ను క్రమం తప్పకుండా రివ్యూ చేస్తుందని, తొలగిస్తుందని తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలు, వేధింపులు, తప్పుడు సమాచారం, విధానాలను ఉల్లంఘించే ఛానెల్స్ ను ఈ వైపీపీ ప్రోగ్రాం నుంచి తీసివేస్తామని ప్రకటించింది.
ఈ ప్రోగ్రాంలో క్రియేటర్లు తమ ఛానెల్స్ మానిటైజేషన్ పై మరింత నియంత్రణను అందించే ప్రోగ్రామ్స్, టూల్స్‌కు యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా తమ సొంత వీడియోలకు రేట్ చేయడానికి క్రియేటర్లు స్వీయ ధ్రువీకరణనను ఉపయోగించవచ్చు. కాపీరైట్ క్లెయిమ్స్, యాడ్ సస్టెయినబిలిటీ పరిమితులకు, క్రియేటర్లు అప్ లోడ్లను ఆటోమేటిక్ గా స్క్రీన్ చేసేందుకు యూట్యూబ్ "తనిఖీలు(Checks)" పేరుతో టూల్స్‌ను రూపొందించింది. క్రియేటర్లు వారి వీడియోలతో డబ్బు సంపాదించడానికి, వాటిని అప్ లోడ్ చేయడానికి ముందు సవరణలు చేసుకోవడానికి ఈ టూల్ సహాయపడుతుంది. తర్వాతి తరం క్రియేటర్లకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి షార్ట్ ఫండ్ లాంటి ఇతర మార్గాలను కూడా అందిస్తున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.