పబ్ జీ ఆడుతూ పిచ్చోడిలా రోడ్డు మీద...

రోడ్డు మీద నిలబడి గన్ చేత్తో పట్టుకున్నట్టుగా ఫోజ్ ఇస్తూ పబ్ జీ గేమ్ ఆడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.

news18-telugu
Updated: May 12, 2019, 8:13 PM IST
పబ్ జీ ఆడుతూ పిచ్చోడిలా రోడ్డు మీద...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 12, 2019, 8:13 PM IST
పబ్ జీ గేమ్ ఆడుతూ పిచ్చోడిలా మారిపోయాడు ఓ యువకుడు. రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. రోడ్డు మీద నిలబడి పబ్ జీ గేమ్ ఆడుతున్నట్టు ఒట్టి చేతులనే గన్‌గా మార్చి.. బుల్లెట్స్ పేలుస్తున్నట్టుగా ఢామ్ ఢామ్ అంటూ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశాడు. ఈ పిచ్చి ప్రవర్తనను గమనించిన స్థానికులు అతడిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పబ్ జీ గేమ్‌ను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. పబ్ జీ గేమ్ ఆడడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందంటూ ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...