స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!

ఒక్కసారి మీ కళ్లు మూసుకోండి. కాసేపు అలాగే ఉండండి. కాసేపు కాదు... ఇక జీవితాంతం అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తే..? అమ్మో... ఊహించడానికే భయంగా ఉంది కదా. ఏమో... మీరు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే చివరికి అదే పరిస్థితి రావొచ్చేమో.

news18-telugu
Updated: August 14, 2018, 4:26 PM IST
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
ఒక్కసారి మీ కళ్లు మూసుకోండి. కాసేపు అలాగే ఉండండి. కాసేపు కాదు... ఇక జీవితాంతం అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తే..? అమ్మో... ఊహించడానికే భయంగా ఉంది కదా. ఏమో... మీరు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే చివరికి అదే పరిస్థితి రావొచ్చేమో.
  • Share this:
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నారా? ట్యాబ్‌లో సీరియస్‌గా గేమ్ ఆడుతున్నారా? ల్యాప్‌టాప్‌లో పనిచేస్తూ ప్రపంచాన్ని మర్చిపోతున్నారా? అయితే జాగ్రత్త. రోజూ మీరు ఇలాగే చేస్తే మీ కళ్లకు అస్సలు మంచిది కాదని తేల్చింది ఓ అధ్యయనం. బ్లూ-టింటెడ్ స్క్రీన్ మెల్లమెల్లగా మిమ్మల్ని అంధత్వం వైపు తీసుకెళ్తోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టోలెడోకు చెందిన కంటి వైద్య నిపుణులు పలుమార్లు సెల్ స్ట్రక్చర్, ఇమేజింగ్ పరీక్షలు జరిపారు. డిస్‌ప్లేస్, స్క్రీన్స్ నుంచి వస్తున్న బ్లూ లైట్ కంటికి హాని చేస్తుందని, రెటీనాలోని ఫోటోరిసెప్టర్ సెల్స్‌ని చంపేస్తుందని తేలింది. మానవ శరీరంలోంచి ఒక్కసారి ఫోటోరిసెప్టర్ సెల్స్‌ చనిపోయాయంటే మళ్లీ తిరిగిరావు. అలా చివరకు బ్లూ లైట్ అంధులుగా మార్చేస్తుంది.

కంటి సమస్యలు, చూపు కోల్పోవడం లాంటివి సాధారణంగా 50 ఏళ్ల తర్వాత వస్తుంటాయి. ఆ కంటి సమస్యలన్నీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవాళ్లలో కనిపించడం నిపుణుల్ని కలవరపరుస్తోంది. ఇప్పటికీ స్క్రీన్‌ నుంచి వస్తున్న బ్లూ లైట్ వల్ల అనేక సమస్యలున్నాయి. శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తోంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కంటికి అలసట, కళ్లు నొప్పులు పుట్టడం లాంటి చిన్నచిన్న సమస్యలతో పాటు క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని అధ్యయనాలు తేలుస్తున్నాయి.

స్క్రీన్‌ టైమ్‌ని తగ్గించుకోవడం, సాయంత్రం తర్వాత ఫోన్ ఎక్కువగా ఉపయోగించకపోవడం, నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్ ఆఫ్ చేయడం మంచిది. ఇలాంటి మార్పులు చేసుకోకపోతే కళ్లు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది.

ఇది కూడా చదవండి:

గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!
Published by: Santhosh Kumar S
First published: August 14, 2018, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading