మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!
రాబోయే అప్డేట్తో మీ వాట్సప్ డేటా అంతా డిలిట్ కానుంది. అంతకుముందే ఎలా బ్యాకప్ చేసుకోవాలో తెలుసుకోండి.
news18-telugu
Updated: August 20, 2018, 4:41 PM IST

రాబోయే అప్డేట్తో మీ వాట్సప్ డేటా అంతా డిలిట్ కానుంది. అంతకుముందే ఎలా బ్యాకప్ చేసుకోవాలో తెలుసుకోండి.
- News18 Telugu
- Last Updated: August 20, 2018, 4:41 PM IST
సాధారణంగా వాట్సప్ అప్డేట్స్తో మీడియా ఫైల్స్, మెసేజెస్, డేటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈసారి పరిస్థితి వేరు. కారణం గూగుల్‌తో వాట్సప్ చేసుకున్న ఒప్పందమే. నవంబర్ 12 నుంచి యూజర్ల బ్యాకప్ చేసుకున్న వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌లో కనిపించదు. "2018 నవంబర్ 12 నుంచి వాట్సప్ బ్యాకప్స్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ కోటాలో లెక్కించరు" అని కంపెనీ ఎఫ్ఏక్యూ పేజీలో కనిపిస్తోంది. "ఏడాది కంటే ఎక్కువగా అప్డేట్ చేయని వాట్సప్ బ్యాకప్స్ని గూగుల్ స్టోరేజీ నుంచి ఆటోమెటిక్‌గా తొలగిస్తాం" అన్నది గూగుల్ వివరణ సారాంశం. అంటే... వాట్సప్ యూజర్లు ఏడాదిగా డ్రైవ్‌లోకి బ్యాకప్ చేయలేదంటే ఆ డేటా కోల్పోవడం ఖాయం. అందులో ఛాట్స్‌తో పాటు మీడియా ఫైల్స్ కూడా ఉండొచ్చు. గూగుల్ డ్రైవ్‌లో చాలాకాలంగా డేటా ఉంటే 2018 నవంబర్ 12 లోగా "మ్యాన్యువల్లీ బ్యాకప్" చేసుకోవాలని వాట్సప్ సూచిస్తోంది.
డేటా బ్యాకప్ ఎలా చేయాలో తెలుసుకోండి:
1. వాట్సప్‌లో త్రీ డాట్ ఐకాన్ క్లిక్ చేసి 'సెట్టింగ్స్' ఓపెన్ చేయండి. అందులో 'ఛాట్స్' సెలెక్ట్ చేసుకోండి.2. 'ఛాట్ బ్యాకప్' క్లిక్ చేయండి. అందులో చివరిసారిగా బ్యాకప్ చేసిన వివరాలుంటాయి. బ్యాకప్ చేసి చాలారోజలై ఉంటే గూగుల్ డ్రైవ్ స్టోరేజీలోకి మళ్లీ 'బ్యాకప్' చేసుకోండి.
3. అందులోనే 'గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్' మార్చుకోవాలి. 'బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్'లో ఆటోమెటిక్ టైమ్ పీరియడ్ సెట్ చేసుకోవాలి. చాట్, మీడియా, వీడియోలు ఇలా మీకు అవసరమైనవి బ్యాకప్ చేసుకోవచ్చు.
నోట్: వాట్సప్ బ్యాకప్ చేసేప్పుడు వైఫై కనెక్షన్ ఉపయోగించడం మంచిది.

WhatsApp: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? వాట్సప్‌ని ఇలా కాపాడుకోండి
WhatsApp: ఇంకొన్ని రోజుల్లో ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు
ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..
WhatsApp: మీ వాట్సప్ వెంటనే అప్డేట్ చేయండి... ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్
వాట్సాప్‌లో వీడియో ఫైల్స్ క్లిక్ చేస్తే... టోటల్ స్మాష్...
WhatsApp Privacy: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... మార్చండి ఇలా
నోట్: వాట్సప్ బ్యాకప్ చేసేప్పుడు వైఫై కనెక్షన్ ఉపయోగించడం మంచిది.