డార్క్‌ వెబ్‌లో మీ డేటా ధర రూ.3,500... అమ్మేస్తున్న కేటుగాళ్లు

ఒకరి డిజిటల్ లైఫ్ డేటాకు 50 డాలర్లు(సుమారు రూ.3,500) చొప్పున చెల్లిస్తున్నట్టు తేలింది. సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంకింగ్ వివరాలు, సర్వర్స్, డెస్క్‌టాప్స్, యూబెర్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై లాంటి సర్వీసులు, గేమింగ్ వెబ్సైట్స్, యాప్స్, పోర్న్ వెబ్‌సైట్స్ లాంటి మొత్తం డేటాను సైబర్ నేరగాళ్లు కొంటున్నట్టు తేలింది.

news18-telugu
Updated: December 17, 2018, 5:15 PM IST
డార్క్‌ వెబ్‌లో మీ డేటా ధర రూ.3,500... అమ్మేస్తున్న కేటుగాళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పర్సనల్ డేటా... మార్కెట్‌లో హాట్‌ కేక్‌లా అమ్ముడుపోతుంది. ఒకరి డేటాను ఎంతమందికైనా అమ్మేసుకొని సొమ్ముచేసుకునేవాళ్లున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంతైనా ఇచ్చి మీ పర్సనల్ డేటా కొంటూ ఉంటారు. మీ సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంకు వివరాలు, ఊబెర్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సర్వీసులు... ఇలా మొత్తం మీ డిజిటల్ లైఫ్ డేటా ధర డార్క్‌ వెబ్‌లో ఎంత పలుకుతుందో తెలుసా? రూ.3,500. అవును... మీ డిజిటల్ డేటాను రూ.3,500 చెల్లించి కొంటున్నట్టు క్యాస్పర్‌స్కీ ల్యాబ్ పరిశోధనలో తేలిన సంచలన విషయమిది.

డార్క్ వెబ్ మార్కెట్స్‌లో పర్సనల్ డేటాకు ఎంత ధర పలుకుతోంది, మీ డిజిటల్ లైఫ్‌ని సైబర్ నేరగాళ్లు ఎంత ఇచ్చి కొనుక్కుంటున్నారు అని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కీ ల్యాబ్ అధ్యయనం జరిపింది. ఒకరి డిజిటల్ లైఫ్ డేటాకు 50 డాలర్లు(సుమారు రూ.3,500) చొప్పున చెల్లిస్తున్నట్టు తేలింది. సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంకింగ్ వివరాలు, సర్వర్స్, డెస్క్‌టాప్స్, యూబెర్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై లాంటి సర్వీసులు, గేమింగ్ వెబ్సైట్స్, యాప్స్, పోర్న్ వెబ్‌సైట్స్ లాంటి మొత్తం డేటాను సైబర్ నేరగాళ్లు కొంటున్నట్టు తేలింది.

ఈ డేటాను హ్యాకింగ్, బ్లాక్ మెయిలింగ్, ఫిషింగ్ లాంటి కార్యకలాపాలకు వాడుకుంటారు సైబర్ నేరగాళ్లు. అయితే సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ వాడటం, పర్సనల్ డేటా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని క్యాస్పర్‌స్కీ ల్యాబ్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రెండు వారాల్లో మీ ఏటీఎం, క్రెడిట్ కార్డులు పనిచేయవు

గుడ్ న్యూస్: ఇక 48 గంటల్లో మొబైల్ నెట్‌వర్క్ మారొచ్చు

రెడ్‌‌మీ నోట్ 6 ప్రో: రూ.999 ధరకే సొంతం చేసుకోండిలా...LIC POLICY: రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షల రిటర్న్స్

వాట్సప్‌లో కొత్తగా 'పిక్చర్ ఇన్ పిక్చర్' మోడ్
First published: December 17, 2018, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading