Old Phone Number: మీరు మీ ఫోన్ నంబర్ ను మార్చారా? అయితే, మీకు ఆ ఇబ్బందులు వచ్చే ఛాన్స్.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

మీరు మీ ఫోన్ నంబర్ ను మార్చారా? పాత నంబర్ వాడడం లేదా? అయితే మీకు ఆ నంబర్ తో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలను తెలుసుకోండి.

  • Share this:
మీరు ఇప్పుడు వాడుతున్న మొబైల్‌ నంబరు.. మీ ఫస్ట్‌ మొబైల్‌ నంబరేనా? ఈ ప్రశ్నకు చాలామంది నుంచి ‘కాదు’ అనే సమాధానమే వస్తుంది. కారణం ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో తీసుకున్న నెంబర్లు.. ఆ తర్వాతి రోజుల్లో వివిధ కారణాల వల్ల మన దగ్గర ఉండవు. ప్రస్తుతం మొబైల్‌ నంబర్ పోర్టబిలిటీ వచ్చింది కాబట్టి... పాత నెంబర్‌ను కొత్త నెట్‌వర్క్‌లకు మార్చుకొని వాడుకుంటున్నాం. గతంలో ఈ అవకాశం లేనప్పుడు పాత సిమ్‌ను పక్కన పడేసేవాళ్లం. అయితే అలా వదిలేసిన నంబర్లు మనకు లేనిపోని ఇబ్బందులు తెస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. వాటి ద్వారా మీ వ్యక్తిగత సమాచారం వేరొకరికి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని నెలలు పాటు మొబైల్‌ నెంబర్ వాడకపోతే.. దాన్ని సంబంధిత నెట్‌వర్క్ సంస్థలు డీయాక్టివేట్‌ చేసి, వేరొకరికి ఇస్తుంటాయి. దీంతో కొంతమంది పాత నెంబర్లు... కొన్నాళ్లకు ఇతరులకు వెళ్లిపోతున్నాయి. దీంతో పాత కస్టమర్లకు చెందిన మెసేజ్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత సందేశాలు కొత్త వ్యక్తులకు వెళ్తున్నాయి.
Aadhaar Card: మీ ఆధార్ కార్డు ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా? అయితే, వెంటనే ఇలా చేయండి

ఫలితంగా కొత్త, పాత వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధకులు 200 రీసైకిల్డ్‌ నెంబర్లు తీసుకొని పరిశోధన చేస్తే అందులో 19 నంబర్లతో ఈ సమస్య వచ్చిందట. వాటికి అథెంటికేషన్‌ పాస్‌కోడ్‌లు, ప్రిస్‌క్రిప్షన్‌ రిమైండర్లు, కాల్స్‌, మెసేజెస్‌ లాంటివి వచ్చాయి. కొత్తగా ఆ నెంబరు తీసుకున్నవాళ్లకు అసలు విషయం తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇలా నంబర్లు మారడం వల్ల చాలా సమస్యలు రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మోసగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారం సేకరించేలా ఈ నంబర్లకు ఫిషింగ్‌ లింక్‌ పంపొచ్చు. ఇది కాకుండా వివిధ అలర్ట్స్‌, న్యూస్‌ లెటర్స్‌, క్యాంపెయిన్స్‌కు సబ్‌స్కైబ్‌ చేయొచ్చు.
WhatsApp group admin: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అందుకు బాధ్యుడు కాదు.. తేల్చి చెప్పిన హైకోర్టు

ఈ నంబరు సాయంతో సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ పాస్‌వర్డ్‌లు రిసెట్‌ చేసేయొచ్చు. ఈ వ్యవహారంపై యూఎస్‌లోని కీలక నెట్‌వర్క్‌లు అయిన వెరీజాన్‌, టీ మొబైల్‌ను ప్రిన్స్‌టన్‌ సంప్రదించింది. అయితే ఈ విషయంలో ఆ సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నంబరు మార్చుకోవడానికి ఆ సంస్థలు ఆన్‌లైన్‌ ఇంటర్ఫేస్‌ను ఇచ్చాయట. ఇంతవరకు ఓకే ఇలా పాత నంబర్లు మళ్లీ ఇచ్చినప్పుడు వాటి పాత సబ్‌స్క్రిప్షన్లు పూర్తిగా తొలగించడం లాంటివి కూడా చేయాలి. లేదంటే పాత సబ్‌స్క్రిప్షన్లు కొత్త వ్యక్తికి వర్తించకుండా చేయాలి. అంతకంటే ముందు పాత నంబరు వదులుకోగానే యూజర్లు ఆ నంబరు ఉన్న చోట తమ కొత్త నంబరు ఇవ్వడం ఉత్తమం. కాబట్టి వినియోగదారులూ జాగ్రత్త!
Published by:Nikhil Kumar S
First published: