Home /News /technology /

SBI Data leak: అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్... స్పందించిన ఎస్‌బీఐ

SBI Data leak: అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్... స్పందించిన ఎస్‌బీఐ

SBI Data leak: ఎస్‌బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్

SBI Data leak: ఎస్‌బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్

SBI Data leak | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్ ముంబైలోని డేటా సెంటర్‌ 'ఎస్‌బీఐ క్విక్‌'లో ఉంటుంది. ఈ సర్వర్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, ఎవరైనా లక్షలాది మంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ వెబ్‌సైట్ కథనం వెల్లడించింది.

ఇంకా చదవండి ...
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ అకౌంట్‌కు భద్రత ఎంత? మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీకైపోతున్నాయా? ఎస్‌బీఐ ఖాతాదారుల అకౌంట్ల వివరాలను హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చా? తాజా కలకలం ఇది. ఎస్‌బీఐ సర్వర్ ఏమాత్రం సురక్షితంగా లేదన్న విషయం తాజాగా బయటపడింది. లక్షలాది మంది అకౌంట్ల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు లీకయ్యాయన్న వార్తలు ఎస్‌బీఐ ఖాతాదారుల్లో కలవరం రేపుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్ ముంబైలోని డేటా సెంటర్‌ 'ఎస్‌బీఐ క్విక్‌'లో ఉంటుంది. అందులో రెండు నెలలకు సంబంధించిన ఖాతాదారుల డేటా ఉంటుంది. అయితే ఈ సర్వర్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదని, ఎవరైనా లక్షలాది మంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ వెబ్‌సైట్ కథనం వెల్లడించింది.

    Read this: IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

    ఎస్‌బీఐ క్విక్ నుంచి కస్టమర్లు టెక్స్ట్‌ మెసేజ్, కాల్స్, మిస్డ్ కాల్ ద్వారా తమ అకౌంట్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించనివారికి ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఎస్‌బీఐ సూచించిన కీవర్డ్స్ ఆధారంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈ సమాచారాన్ని ఖాతాదారులు తెలుసుకోవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, చివరి ఐదు లావాదేవీలు, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, హోమ్ లోన్, కార్ లోన్స్‌కు సంబంధించిన సమాచారం పొందొచ్చు. ఇలా ఎస్‌బీఐ క్విక్‌కు రోజూ లక్షల మెసేజ్‌లు కాల్స్ వస్తుంటాయి. పాస్‌వర్డ్ లేని డేటాబేస్‌కు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకునే ప్రమాదముంది. ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇటీవల జరిపిన లావాదేవీలన్నీ తెలిసిపోతాయి.

    Read this: జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?

    హ్యాకర్లు ఎస్‌బీఐ సర్వర్‌ను టార్గెట్ చేస్తే సుమారు 74 కోట్ల ఖాతాలు ప్రమాదంలో పడే అవకాశముంది. టెక్ క్రంచ్ వెబ్‌సైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించిన తర్వాత సర్వర్‌లో ఈ లోపాన్ని సరిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ డేటా లీక్ వ్యవహారంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది.



    అయితే ఈ డేటా లీక్ వల్ల ఎంతమంది కస్టమర్ల ఖాతాలకు ముప్పు ఉందన్న విషయం తెలియాల్సి ఉంది.

    Honor View 20: అదిరిపోయే ఫీచర్లతో హానర్ వ్యూ 20...

    ఇవి కూడా చదవండి:

    Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

    మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే

    Redmi Go: షావోమీ నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్
    First published:

    Tags: Banking, Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు