Instagram: ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవుతుందని భయమా.. ఈ విషయాలు పాటిస్తే సేఫ్

(ప్రతీకాత్మక చిత్రం)

ఇటీవలి కాలంలో కొన్ని ఇన్​స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందారు. అందుకే అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి.

  • Share this:
ఫేమస్ సోషల్ మీడియా యాప్ ఇన్​స్టాగ్రామ్​లో చాలా మంది ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఫోటో వీడియో షేరింగ్ యాప్ అయిన ఇన్​స్టాను యువత ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ఇన్​స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందారు. అందుకే అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనిద్వారా అకౌంట్ సేఫ్​గా ఉంటుంది. ఇన్​స్టా సెక్యూరిటీని పెంచుకునేందుకు ఏం చేయాలంటే..

టూ ఫ్యాక్టర్​ అథంటికేషన్
ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనిద్వారా మీ మొబైల్​కు ఓటీపీ రానిదే లాగిన్ అయ్యే అవకాశం ఉండదు. ఇలా చేస్తే ఒకవేళ పాస్​వర్డ్ లీకైనా.. ఓటీపీ ఉండదు కాబట్టి వేరే వ్యక్తులు మీ అకౌంట్ యాక్సెస్ చేసే అవకాశం ఉండదు.

సెక్యూరిటీ చెకప్​
అకౌంట్ హ్యాక్ అయిందా లేదా అని అనుమానం ఉంటే ఇన్​స్టా కొత్తగా తీసుకొచ్చిన సెక్యూరిటీ చెకప్​ ఆప్షన్​ను వెంటనే వాడాలి. సెక్యూరిటీ చెకప్​లో.. ఎన్నిసార్లు, ఏ డివైజ్​ల్లో లాగిన్ అయ్యారో అన్న సమాచారం, ప్రొఫైల్ డిటైల్స్​, అకౌండ్​ రికవరీ కాంటాక్ట్​ ఇన్ఫర్మేషన్​, రికవరీ ఫోన్ నంబర్​, ఈమెయిల్​ మార్చుకునే సదుపాయాలు ఉంటాయి. లాగిన్ యాక్టివిటీని చూస్తే మీ అకౌంట్ మరెవరైనా వాడుతున్నారో లేదా ఇట్టే పట్టేయవచ్చు.

లాగిన్ రిక్వెస్ట్​లు
ఎప్పుడైనా వెబ్​ బ్రౌజర్​లో, కొత్త డివైజ్​లో లాగిన్ అయ్యేటప్పుడు యాప్​లో పర్మిషన్ అడిగేదే ఈ లాగిన్ రిక్వెస్ట్​. ఇది ఎనేబుల్​ చేసుకుంటే.. మీ ఫోన్​లోని యాప్​లో తప్ప ఎక్కడ లాగిన్ కావాలన్నా మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్​ చేయాల్సిందే. ఇది కచ్చితంగా ఎనేబుల్ చేసుకుంటే అకౌంట్ సేఫ్​గా ఉంటుంది.

ఫోన్​ నంబర్, ఈమెయిల్ అప్​డేట్​
ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​కు లింక్ అయిన ఫోన్ నంబర్​, ఈమెయిల్ ఐడీని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పాతవి కనుక ఉంటే వెంటనే మీరు ప్రస్తుతం వాడుతున్న నంబర్, ఈమెయిల్ ఐడీని అప్​డేట్ చేసుకోవాలి.

డైరెక్ట్​ మేసేజ్​ల్లో సమాచారం ఇవ్వొద్దు
కొన్నిసార్లు హ్యాకర్లు.. ఇన్​స్టాగ్రామ్​ సంస్థ నుంచి అంటూ మెసేజ్ చేస్తారు. మీ పాలసీలను ఉల్లంఘించినందుకు మీ అకౌంట్​ బ్యాన్ అవుతుందని, మీ సమాచారం షేర్ చేస్తే ఆపుతామని చెబుతారు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్​ సమాచారం, పాస్​వర్డ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇన్​స్టాగ్రామ్ ఎప్పటికీ డైరెక్ట్ మెసేజ్ చేయదని గుర్తుంచుకోవాలి.

ఈ మెయిల్ చెక్ చేసుకోవాలి
ఇన్​స్టాగ్రామ్ నుంచి వచ్చే మెయిల్స్​ను కూడా అప్పుడప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాలి. కొత్త లాగిన్లతో పాటు యాక్టివిటీ మెయిల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఓ లుక్కేయడం మంచిది. సెట్టింగ్స్​లో ఈ మెయిల్స్ ఫ్రమ్ ఇన్​స్టాగ్రామ్ ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకుంటే మెయిల్స్ పొందవచ్చు

రిపోర్ట్ చేయవచ్చు
ఏవైనా పోస్టులు, వీడియోలు, రీల్స్​, ఫొటోలు.. డూప్ చేసినట్టుగా అనిపిస్తే వెంటనే ఇన్​స్టాలోనే రిపోర్ట్ చేయవచ్చు. ఏ పోస్ట్​పై ఫిర్యాదు చేసినా వారి వివరాలు గోప్యంగానే ఉంటాయి.
Published by:Sumanth Kanukula
First published: