Facebook: ఫేస్‌బుక్‌ అద్భుత ఆఫర్.. రూ.30 వేల నుంచి రూ. 50 లక్షలు గెలుచుకునే చాన్స్.. వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

Facebook: బగ్‌ బౌంటీ హంటర్స్‌కు ఫేస్‌బుక్‌ బోనస్‌లు ప్రకటించింది. పే ఔట్‌ టైమ్‌ బోనస్‌ పేరుతో ఈ రివార్డులు ఇవ్వనున్నారు. సంస్థకు బగ్‌ వివరాలు పంపించిన తర్వాత పేమెంట్‌ పంపడానికి 30 రోజులు దాటిపోతే ఈ బోనస్‌ ఇస్తారట. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
తమ యాప్‌/సర్వీసు/వెబ్‌సైట్‌లో సమస్యలు, బగ్స్‌ను కనుగొన్నవారికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు డబ్బులు ఇస్తుంటాయి. బగ్‌ను బట్టి డబ్బుల మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా ఏళ్లుగా ఫేస్‌బుక్‌ బగ్‌ బౌంటీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బగ్‌ బౌంటీ హంటర్స్‌కు ఫేస్‌బుక్‌ బోనస్‌లు ప్రకటించింది. పే ఔట్‌ టైమ్‌ బోనస్‌ పేరుతో ఈ రివార్డులు ఇవ్వనున్నారు. సంస్థకు బగ్‌ వివరాలు పంపించిన తర్వాత పేమెంట్‌ పంపడానికి 30 రోజులు దాటిపోతే ఈ బోనస్‌ ఇస్తారట. బౌంటీ హంటర్స్‌ తెలిపిన బగ్‌కు స్పందిచడానికి ఒక్కోసారి ఆ సంస్థకు సమయం పడుతుంటుంది. ఫేస్‌బుక్‌ విషయంలో అప్పుడప్పుడు ఇది జరుగుతుంటుంది. అలాంటి సమయంలోనే ఈ పేఔట్‌ బోనస్‌ ఇస్తారట. ఒక్కోసారి బగ్స్‌కు స్పందించడమో, లేకపోతే స్పందించినా.. వాటిని ఫిక్స్‌ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఆ సమయంలో బగ్‌ బౌంటీ చేసే వాళ్లు కాస్త ఓపికతో ఉండాల్సి ఉంటుంది. ఆ ఓపికకు బహుమతిగానే అదనపు సొమ్మును బోనస్‌ రూపంలో ఇస్తున్నాం అని చెప్పింది ఫేస్‌బుక్‌.

ఫేస్‌బుక్‌ బగ్‌ బౌంటీ హంటర్స్‌ పేఔట్‌ టైమ్‌ బోనస్‌ విధానం స్లైడింగ్‌ స్కేల్‌ విధానంలో ఉంటుంది. బగ్‌ను గుర్తించి ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకొచ్చిన 30 నుండి 59 రోజుల్లో ఫిక్స్‌ చేస్తే బగ్‌ బౌంటీకి ఇచ్చే రుసుముతోపాటు అదనంగా ఐదు శాతం బోనస్‌ ఇస్తారు. అదే 60 నుండి 89 రోజులు సమయం తీసుకుంటే అదనంగా 7.5 శాతం బోనస్‌ ఇస్తారు. 90 రోజుల తర్వాత ఇచ్చే ప్రతి బౌంటీ రివార్డుకు అదనంగా 10 శాతం బోనస్‌ ఇస్తారు. ఒకవేళ బగ్‌కు సంబంధించిన అదనపు సమాచారం, రిపోర్ట్‌లు అవసరం అయితే... దానికి తగ్గట్టుగా సమయం అడ్జస్ట్‌ చేస్తారు.

బగ్‌ బౌంటీ హంటర్లకు ఫేస్‌బుక్‌ ప్రస్తుతం 500 డాలర్ల(దాదాపు రూ. 30వేలు) నుండి 80 వేల డాలర్ల(రూ.50 లక్షలు) వరకు ఇస్తోంది. బగ్‌కు తగ్గట్టుగా ఈ రివార్డు ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే అదనపు బోనస్‌ కూడా దీని ఆధారంగా సాగుతుంది. అంటే ఉదాహరణకు 1000 డాలర్ల రివార్డు వచ్చే బౌంటీ హంటర్‌కు పేమెంట్‌ రావడం, స్పందించడం ఆలస్యమైతే 31 వ రో జు నుండి 59 వ రోజుకు అదనంగా ఐదు శాతం.. ఇస్తారు. అంటే వెయ్యి డాలర్లకు అదనంగా 50 డాలర్లు కలుస్తాయి.
Published by:Veera Babu
First published: