Home /News /technology /

YOU CAN UNLOCK YOUR IPHONE WITHOUT TAKING YOUR FACEMASK HERE IS THE DETAILS MS GH

IPhone Face Unlock: మాస్క్ తీయకుండా ఐఫోన్ ను అన్లాక్ చేయొచ్చు.. త్వరలో సరికొత్త అప్డేట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPhone Face Unlock: ఐఫోన్ వాడేవాళ్లందరికి ఫేస్ రికగ్నైజేషన్ లాక్ గురించి తెలిసే ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో పబ్లిక్ లో ఫేస్ మాస్క్ వేసుకొని దీన్ని లాక్ చేయలేం. ఇందుకోసం ఆపిల్ సంస్థ గత మేలో పాస్ కోడ్ ఎంట్రీ ఆప్షన్ ను పొందుపరిచింది. త్వరలో దీన్ని మరింత అప్డేట్ చేస్తూ సరికొత్త సెక్యురిటీ టూల్ ను తీసుకురానుంది.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్స్ లో అత్యంత లగ్జరీ ఫోన్లు ఏంటి..? అని ఎవరైనా అడిగితే టక్కున చెప్పేమాట.. ఇంకేముంది ఐఫోన్ అని.. అవును ఆపిల్ సంస్థ విడుదల చేసే ఈ ఐఫోన్లు అత్యంత విలాసవంతమైన ఫోన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం భద్రత. అందుకే ఫోన్ ప్రియులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. త్వరలో ఈ ఫోన్ లో భద్రతకు సంబంధించి సరికొత్త అప్డేట్ ను పొందుపరిచనుంగి. పబ్లిక్ లో ఫేస్ మాస్క్ తీయకుండానే ఐఫోన్ ను అన్ లాక్ చేసే సదుపాయాన్ని తీసుకురానుంది. కాకపోతే ఇందుకోసం అదనపు ఆపిల్ డివైజ్ ను తీసుకోవాల్సి ఉంటుంది.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఐఫోన్ వాడేవాళ్లందరికి ఫేస్ రికగ్నైజేషన్ లాక్ గురించి తెలిసే ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో పబ్లిక్ లో ఫేస్ మాస్క్ వేసుకొని దీన్ని లాక్ చేయలేం. ఇందుకోసం ఆపిల్ సంస్థ గత మేలో పాస్ కోడ్ ఎంట్రీ ఆప్షన్ ను పొందుపరిచింది. త్వరలో దీన్ని మరింత అప్డేట్ చేస్తూ సరికొత్త సెక్యురిటీ టూల్ ను తీసుకురానుంది. ఆపిల్ వాచ్ ల్లోనూ ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం సరికొత్త ఐఓఎస్ సాఫ్ట్ వేర్ ను పరీక్షిస్తోంది.

ఈ తాజా అప్డేట్ బీటా టెస్టింగ్ లో ఉండగా.. త్వరలో విడుదలయ్యే అవకాశముంది. ఫేస్ ఐడీని ఉపయోగించడానికి ఫోన్ తీసుకుంటే దీంతో అనుసంధించిన ఆపిల్ వాచ్ తో కమ్యునికేట్ చేయడానికి అనుమతిస్తుందీ సాఫ్ట్ వేర్. అంటే ఫేస్ ఐడీతో ఐఫోన్ ఓపెన్ చేయాలంటే ఆపిల్ వాచ్ తో అనుసంధించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అథెంటికేషన్ పూర్తయినప్పుడు ఈ రెండి డివైజ్ లు దగ్గరగా ఉండాలి. అప్పుడే ఐఫోన్ స్వయంచాలకంగా అన్ లాక్ అవుతుంది. ఇదే సమయంలో ఆపిల్ వాచ్ వైబ్రేట్ అవుతుంది.

అయితే యూజర్లు ఈ ఫీచర్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉందని సంస్థ తెలిపింది. భద్రతా ప్రయోజనాల కోసం ఈ అప్డేట్ ఫోన్ అన్ లాక్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. మాస్క్ ధరించి వినియోగదారులు ఆపిల్ పే, యాప్ స్టోర్ లేదా ఐట్యూన్స్ ద్వారా లావాదేవీలు చేయడానికి పాస్ కోడ్ ను టైప్ చేయాలి.

కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మాస్క్ ధరించేందుకు మద్దతుగా ఆపిల్ వినియోగదారులకు స్మార్ట్ వాచ్ కొనడానికి ప్రోత్సాహకం లేదా కనీసం వారు ఎక్కువగా ఉపయోగించడం కోసం ఈ అప్డేట్ ముందడుగు లాంటిది. ఆపిల్ తాజా అప్డేట్ ఐఓఎస్ ను సెప్టెంబరులో ప్రారంభించగా.. ఎర్రర్లు పరిష్కరించడానికి నూతన లక్షణాలను పరిచయం చేయడానికి కంపెనీ నిరంతరం అప్టేట్లను విడుదల చేస్తుంది. మార్చి తర్వాత ఆపిల్ యూజర్లకు ఇంటర్నెట్ అంతటా వాటిని ట్రాక్ చేయడానికి స్పష్టమైన అనుమతి ఇవ్వడాన్ని నూతన అవసరాన్ని ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published:

Tags: Apple, Corona, Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు