Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్... ఇలా చేయొచ్చు

Amazon Pay | అమెజాన్ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన P2P అంటే పర్సన్ టు పర్సన్ ఫీచర్. ఈ ఫీచర్‌తో అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులువు.

news18-telugu
Updated: April 30, 2019, 11:28 AM IST
Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్... ఇలా చేయొచ్చు
Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్... ఇలా చేయొచ్చు
  • Share this:
అమెజాన్... ఇ-కామర్స్ కంపెనీగా చాలామందికి పరిచయం. కానీ అమెజాన్ అందిస్తున్న సేవలు అనేకం. పేటీఎం లాగే అమెజాన్ కూడా వ్యాలెట్ సేవల్ని అందిస్తోంది. అమెజాన్ పే ద్వారా బిల్లులు చెల్లించడం, టికెట్లు బుక్ చేయడం లాంటి సేవల్ని యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక అమెజాన్ పే నుంచి డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపేందుకు అమెజాన్ పే ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. అమెజాన్ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన P2P అంటే పర్సన్ టు పర్సన్ ఫీచర్. ఈ ఫీచర్‌తో అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులువు. ఇప్పటికే గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ UPI సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

అమెజాన్ పే ప్లాట్‌ఫామ్‌ను నమ్మకమైన, అనుకూలమైన సేవలుగా మార్చడం మా లక్ష్యం. అమెజాన్ యాప్‌ పైన కస్టమర్లకు విశ్వాసం ఉంది. అందుకే పేమెంట్ సేవల్ని విస్తరిస్తున్నాం. అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌ ద్వారా షాపింగ్ మాత్రమే కాదు, పేమెంట్ సేవలు పొందే కస్టమర్లు భారీగా మాకున్నారు.

వికాస్ బన్సాల్, అమెజాన్ పే డైరెక్టర్


amazon, Amazon Pay, Instant P2P Money Transfers, Amazon Shopping, Amazon money trasnfer, Amazon UPI, Amazon UPI money transfer, digital payments, Reserve Bank of India, UPI services, అమెజాన్, అమెజాన్ పే, అమెజాన్ షాపింగ్, అమెజాన్ మనీ ట్రాన్స్‌ఫర్, అమెజాన్ యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మీ ఫోన్‌లో అమెజాన్ పే యూపీఐ సెట్ చేసుకోవడం చాలా సులువు. మొదటిసారి యూపీఐ గేట్‌వే ఉపయోగించుకుంటున్నప్పుడు మీ ఫోన్ నెంబర్ వెరిఫై అవుతుంది. మీ ఫోన్ నెంబర్‌కు ఉన్న అకౌంట్లన్నీ చూపిస్తాయి. అందులో మీకు కావాల్సిన అకౌంట్ ఎంచుకొని యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నారో వాళ్లు కూడా అమెజాన్ పే యూపీఐకి రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...
ఇవి కూడా చదవండి:

WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్

Aadhaar Card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా...
Published by: Santhosh Kumar S
First published: April 30, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading