• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • YOU CAN RIDE THESE ELECTRIC SCOOTER WITHOUT LICENSE AND REGISTRATION NS GH

Electric Scooters: ఈ స్కూటర్లను నడపాలంటే లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్​ అవసరం లేదు.. ఎందుకంటే..

Electric Scooters: ఈ స్కూటర్లను నడపాలంటే లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్​ అవసరం లేదు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

వాహనాలు నడపాలంటే లైసెన్స్ తో పాటు​, వాహన రిజిస్ట్రేషన్​ తప్పనిసరి. లేకుండా దొరికితే పోలీసులు ఫైన్ల పేరుతో తాట తీస్తారు. కానీ ఈ ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రం లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ లేకుండానే నడపొచ్చు. ఆ వాహనాల వివరాలివే..

  • Share this:
రోడ్డుపై ఏదైనా వాహనాన్ని నడపాలంటే మీరు తప్పకుండా లైసెన్స్​, వాహన రిజిస్ట్రేషన్​, బీమా పత్రాలను కలిగి ఉండాలి. లేదంటే పోలీసులు మీ వాహనాన్ని ఆపి ఫైన్​ వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే, కొన్ని వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇవి 250 వాట్ల మోటారుతో అమర్చబడి 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. వీటిని నడపడానికి ఎటువంటి లైసెన్స్​, వాహన రిజిస్ట్రేషన్​ అవసరం లేదు. అలాంటి వాహనాలు కూడా ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు కదా..! ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.

Hero Electric Optima E5:
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో హీరో ఎలక్ట్రిక్​కు మంచి పేరుంది. ఈ సంస్థ నుండి వచ్చిన ఆప్టిమా ఈ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్​ 250 వాట్ హబ్-మౌంటెడ్ డిసి ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 48V / 28Ah లిథియం -అయాన్ బ్యాటరీతో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్​​ 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే చాలు 65 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. దీని బరువు కేవలం 68 కిలోలు మాత్రమే. ఇది లిథియం -అయాన్ బ్యాటరీ లేదా లీడ్-యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది.

Okinawa Lite
ఎలక్ట్రికల్​ వాహనాల స్టార్టప్ సంస్థ ఓకినావా నుండి విడుదలైన ఓకినావా లైట్ ఈ– స్కూటర్​ను ఎటువంటి లైసెన్స్​ లేకుండానే నడపవచ్చు.​ ఆల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ టైలాంప్, ఎల్‌ఈడీ ఇండికేటర్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ల బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. దీనిలో 1.25 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని అందించారు. ఇది ఒకే ఛార్జీపై 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఒకినావా లైట్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. ఇది 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. స్కూటర్‌కు ఈ–ఎబిఎస్ రీజనరేటివ్​ బ్రేకింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటివి లభిస్తాయి.

Okinawa R30
లైసెన్స్, పియుసి, ఇన్సూరెన్స్ వంటివి లేకుండానే ఒకినావా ఆర్​ 30 ఈ–స్కూటర్​ను నడుపవచ్చు. ఇది 1.25 kWh లిథియం- అయాన్ బ్యాటరీతో జత చేయబడి ఉంటుంది. దీనిలో 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారు అందించారు. ఒకినావా ఆర్ 30 వేరియంట్​ 30 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Ampere Reo Elite
ఆంపియర్ REO ఎలైట్ ఈ–స్కూటర్​ కూడా 250 వాట్స్​ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. దీనిలో ప్రీమియం లుకింగ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్​, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రంట్ ఆప్రాన్ పాకెట్​, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు. ఇది 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీనిలో లీడ్ -యాసిడ్, లిథియం- అయాన్ బ్యాటరీని అందించారు. లిథియం- అయాన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 60 కి.మీ. వరకు ప్రయాణించగలదు.

Hero Electric Flash E2:
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ 2 వేరియంట్​ లిథియం- అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని లైసెన్స్, పియుసి, రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ లేకుండానే నడపవచ్చు. ఇది సాంప్రదాయ పెట్రోల్- ఇంజిన్​తో పనిచేస్తుంది. దీనిలో 48 -వోల్ట్ 28Ah లిథియం- అయాన్ బ్యాటరీ, హబ్-మౌంటెడ్ 250- వాట్ల ఎలక్ట్రిక్ మోటారు,ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను అందించింది. ఇది 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది కేవలం 69 కిలోగ్రాముల బరువు ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 65 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీని ఫుల్​ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది.

Lohia Oma Star Li
లోహియా ఒమా స్టార్ లి ఈ–స్కూటర్​లో 250 వాట్ల హబ్ మోటారు, లిథియం -అయాన్ బ్యాటరీని అందించారు. ఈ -స్కూటర్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే చాలు 60 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. ఇది 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై నడుస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు