మొబైల్లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడీ ఆడీ బోర్ కొడుతోందా? స్మాల్ స్క్రీన్‌పై ఆడాలంటే ఇబ్బంది పడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఓ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. దాని ద్వారా కంప్యూటర్లలో భారీ స్క్రీన్లపై ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుకోవచ్చు. మొబైల్లో కంటే ఎక్కువ క్లారిటీతో, ఎక్కువ వేగంతో, ఎక్కువ సౌండ్ సిస్టంతో, ఎక్కువ కలర్స్‌తో, ఎక్కువ వర్చువల్ ఫీలింగ్‌తో ఆడుకోవచ్చు. మొబైల్లో గేమింగ్ కీస్ తక్కువగా ఉంటాయి. అదే కంప్యూటర్ కీబోర్డు, మౌస్ ద్వారా ఎక్కువ కీలతో ఎంతో చక్కగా ఆడుకోవచ్చు. అందుకోసం వచ్చిందే bluestacks. ప్రస్తుతం బ్లూస్టాక్స్ సాఫ్ట్వేర్ ఫ్రీ వెర్షన్లో వస్తోంది. అందువల్ల ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడొచ్చు. అందుకోసం www.bluestacks.com లింక్ లోకి వెళ్లండి. అంతకంటే ముందు ఈ సాఫ్ట్వేర్ విశేషాలు కొన్ని తెలుసుకోండి.

బ్లూస్టాక్స్ (Image : Twitter/Facebook)
బ్లూస్టాక్స్ ప్రత్యేకతలు :
* మొబైల్ గేమ్స్ ని కంప్యూటర్లో ఆడుకోవడానికి ఇదే ఫాస్ట్ సాఫ్ట్వేర్ అంటున్నారు. ఈ కంపెనీ 100కు పైగా మొబైల్ గేమింగ్ కంపెనీల్లో భాగస్వామిగా ఉంది. పెద్ద గేమ్స్ తయారీలో పాలుపంచుకుంటోంది. ఇంటెల్, శాంసంగ్ వంటి ప్రపంచ ప్రముఖ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది.
* ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7.1.2 (నాగాట్) వెర్షన్‌తో కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవచ్చు. అందువల్ల హై గ్రాఫిక్స్‌తో గేమ్స్ ప్లే అవుతాయి. మున్ముందు లేటెస్ట్ ఆండ్రాయిడ్‌లోకి అప్‌గ్రేడ్ అవుతారు.

బ్లూస్టాక్స్ (Image : Twitter/Facebook)
* ఇప్పటికే 30 కోట్ల మంది బ్లూస్టాక్స్ సాఫ్ట్ వేర్ని డౌన్లోడ్ చేసి పీసీల్లో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుకుంటున్నారు. ప్రధానంగా మొబైల్లో కంటే కంప్యూటర్లో ఎక్కువ క్లారిటీతో గేమ్స్ వస్తుండటం అందరికీ నచ్చుతోంది. గేమ్స్ ఆడేందుకు కీబోర్డ్ ఆప్షన్లు కూడా ఎక్కువగా ఉండటం మరో కలిసొచ్చే అంశం.
* ఇందులో గేమ్స్ ఆడేవారు పాయింట్లు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా ప్రైజెస్ గెలుచుకునే ఆఫర్ ఉంది. బ్లూస్టాక్స్కి ఎఫిలియేట్గా చేరేవారు మనీ కూడా సంపాదించుకునే వీలుంది. ఇలాంటి మంచి ఆఫర్లతో బ్లూస్టాక్స్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఇంకెందుకాలస్యం... మీరు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లి... మీ సిస్టంలో ఫుల్ స్క్రీన్‌లో గేమ్స్ ఆడేసుకోండి మరి.