Lenovo Laptop: మీరు కోరుకునే ఫీచర్లతో ల్యాప్‌టాప్‌... లెనోవో 'మేడ్ టు ఆర్డర్' సర్వీస్

Lenovo Laptop | కంపెనీ అందించే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ నచ్చనివాళ్లు తమకు నచ్చినట్టుగా ల్యాప్‌టాప్‌ను తీర్చిదిద్దుకోవడానికి 'మేడ్ టు ఆర్డర్' సర్వీస్ ఉపయోగపడుతుంది.

news18-telugu
Updated: June 27, 2019, 11:49 AM IST
Lenovo Laptop: మీరు కోరుకునే ఫీచర్లతో ల్యాప్‌టాప్‌... లెనోవో 'మేడ్ టు ఆర్డర్' సర్వీస్
Lenovo Laptop: మీరు కోరుకునే ఫీచర్లతో ల్యాప్‌టాప్‌... లెనోవో 'మేడ్ టు ఆర్డర్' సర్వీస్
  • Share this:
ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. మామూలుగా అయితే ఏ ల్యాప్‌టాప్ అయినా కంపెనీ అందించే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తోనే మార్కెట్లో దొరుకుతాయి. కంప్యూటర్ అసెంబ్లింగ్ చేయించినట్టుగా కంపెనీ నుంచి కొనే ల్యాప్‌టాప్‌లో మార్పుచేర్పులు చేసుకోవడం కొంచెం కష్టమే. పర్సనలైజ్డ్ ల్యాప్‌టాప్స్ కోరుకునేవారికోసం లెనోవో 'మేడ్ టు ఆర్డర్' పేరుతో కొత్త సర్వీస్ అందిస్తోంది. ఎవరైనా ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే కంపెనీ ఇచ్చే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మాత్రమే కాకుండా... సొంతగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో మార్పుచేర్పులు చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా ల్యాప్‌టాప్ ధర మారుతుంది.

కంపెనీ అందించే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ నచ్చనివాళ్లు తమకు నచ్చినట్టుగా ల్యాప్‌టాప్‌ను తీర్చిదిద్దుకోవడానికి 'మేడ్ టు ఆర్డర్' సర్వీస్ ఉపయోగపడుతుంది. సీపీయూ, స్టోరేజ్, గ్రాఫిక్స్ ఇలా అనేక అంశాల్లో మార్పుచేర్పులు చేసుకోవచ్చు. కస్టమర్లకు ఏకంగా 1,00,000 కాన్ఫిగ్యురేషన్ ఆప్షన్స్ అందిస్తోంది లెనోవో. కస్టమైజ్ చేసుకున్న కస్టమర్లకు రెండువారాల్లో ల్యాప్‌టాప్ డెలివరీ చేస్తామని ప్రకటించింది లెనోవో. ప్రస్తుతం కేవలం థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లకే ఈ సర్వీస్ అందిస్తోంది. ఆ తర్వాత ఐడియాప్యాడ్, యోగా ల్యాప్‌టాప్‌లకు కూడా ఈ సర్వీస్ పొడిగించనుంది లెనోవో.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలా

LG Smartphone: రూ.9,999 ధరకే ట్రిపుల్ కెమెరా ఫోన్... ఎల్‌జీ సంచలనం

WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే
Published by: Santhosh Kumar S
First published: June 27, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading