• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • YOU CAN NOW BOOK COVID 19 VACCINE APPOINTMENTS ON PAYTM WITH VACCINE FINDER SERVICE SU

Paytm యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. పేటీఎంలో కోవిడ్ వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

పేటీఎంలో కోవిడ్ వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యాప్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత కేంద్రం వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అయితే గత నెల చివరిలో కోవిన్ యాప్‌తో పాటు థర్డ్‌ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్‌ స్లాట్‌ల బుకింగ్‌కు అనుమతి ఇస్తూ మార్గదర్శకాల్లో మార్పు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యాప్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ఫీచర్‌ను యాప్‌లో vaccine finder serviceకు యాడ్ చేయనున్నట్టు తెలిపింది.

    vaccine finderను క్లిక్ చేయడం ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ బుకింగ్ స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల స్లాట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం పిన్ కోడ్, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. టీకా రకంతో పాటు దాని రుసుము వంటి ఇతర సమాచారం కూడా తమ యాప్‌లో అందుబాటులో ఉంటుందని వారు తెలిపింది. ఈ కొత్తసేవలు భారతీయులు వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి సహాయ పడనున్నాయని పేటీఎం సంస్థ పేర్కొంది. గత కొన్ని వారాలుగా వినియోగదారులు తమ యాప్ ద్వారా టీకా స్లాట్ల లభ్యత కోసం తనిఖీ చేశారని పేటీఎం తెలిపింది.





    ‘కరోనా మహమ్మారి బారి నుంచి భారతదేశం బయటపడటానికి సహాయపడటం మా వంతుగా ఈ ప్రయత్నం. వ్యాక్సిన్ ఫైండర్ పౌరులకు సమీప కేంద్రంలో సజావుగా బుక్ చేసుకోవటానికి మరియు టీకాలు వేయించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు. కొవిడ్‌-19 సహాయక చర్యల్లో భాగంగా పేటీఎం సంస్థ ఇప్పటికే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళం ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది.
    First published: