రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

బజాజ్ అలియాంజ్‌తో కలిసి ఫ్లిప్‌కార్ట్ ఇన్సూరెన్స్ కవర్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లకు ఈ ఇన్సూరెన్స్ ఏడాదిపాటు వర్తిస్తుంది. యాక్సిడెంటల్, స్క్రీన్, లిక్విడ్ డ్యామేజ్‌తో పాటు ఫోన్ చోరీకి గురైనా ఇన్సూరెన్స్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

news18-telugu
Updated: October 8, 2018, 11:26 AM IST
రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!
image: FLIPKART
  • Share this:
ఇ-కామర్స్ దిగ్గజ్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లకు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకొని మొబైల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఇన్సూరెన్స్ పొందొచ్చు.

ఇన్సూరెన్స్ ఎలా పొందాలి?
ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మీరు ఏ మొబైల్ కొన్నా రూ.99 అదనంగా చెల్లించి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మొబైల్ కార్ట్‌లోకి యాడ్ చేసేప్పుడే రూ.99 ఇన్సూరెన్స్‌ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. బిల్లు చెల్లించేప్పుడు ఫోన్ ధరతో పాటు రూ.99 అదనంగా చెల్లిస్తే చాలు. ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే. ఇందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్‌కు వస్తుంది.

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!, you can buy smartphone insurance in flipkart, just Rs.99 for one year
image: FLIPKART
ఏమేం కవర్ అవుతాయి?
సాధారణంగా మొబైల్‌కు ఇన్సూరెన్స్ తీసుకుంటే యాక్సిడెంటల్, స్క్రీన్, లిక్విడ్ డ్యామేజ్‌ ప్రొటెక్షన్ మాత్రమే లభిస్తాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసే ఈ ఇన్సూరెన్స్‌లో యాక్సిడెంటల్ స్క్రీన్ డ్యామేజ్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు, వాటర్ డ్యామేజ్‌తో పాటు అదనంగా థెఫ్ట్ కవర్(మొబైల్ చోరీకి గురైనా) ఇన్సూరెన్స్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఈ సేల్‌కు మాత్రమే పరిమితం. రూ.99తో తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ ఫోన్ డెలివరీ అయిన రోజు నుంచి ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. క్రెయిమ్స్ కోసం కస్టమర్లు యాప్, ఇ-మెయిల్, ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు.

ఇవి కూడా చదవండి:అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!
First published: October 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు