ఈ భూమిపై ఉన్న ఖనిజాల్లో బంగారం అరుదైనది. ఇప్పటికే గనుల్లో చాలా వరకు బంగారాన్ని తవ్వేశారు. ప్రస్తుతం ఉన్న బంగారంలో ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులు నిల్వ పెట్టుకున్నాయి. ప్రజలు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టి దాచుకున్నారు. ఇక మిగతా బంగారం నగల రూపంలో వాడుకలో ఉంది. ఎప్పుడో వేల సంవత్సరాల నుంచీ బంగారాన్ని వాడుతూనే ఉన్నారు. అంతెందుకు ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతం మన దేశంలో మహిళలు వాడుతున్నారు. అది ఎంత ఎక్కువంటే... అమెరికా, ఐఎంఎఫ్, స్విట్జర్లాండ్, జర్మనీలో బంగారం నిల్వల కంటే ఎక్కువ. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... అసలీ బంగారం భూమిపై పుట్టనే లేదు. 20 కోట్ల సంవత్సరాల కిందట కొన్ని ఉల్కలు భూమిని బలంగా ఢీకొట్టాయి. వాటి నుంచీ వచ్చిన బంగారాన్నే మనం ఇప్పుడు వాడుతున్నాం.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 1998లో నాసాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే... మన భూమికి దగ్గర్లోనే తిరుగుతున్న ఎరోస్ గ్రహశకలం నిండా (Eros Asteroid) రకరకాల ఖనిజాలున్నాయని రెండెజెవోస్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా తెలిసింది. బంగాళాదుంపలా కనిపించే ఆ గ్రహశకలాన్ని పరిశోధించగా... దాని లోపల 20 లక్షల కేజీల బంగారం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు... అల్యూమినియం, ప్లాటినం ఖనిజాలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయని అర్థమైంది. కానీ వాటిని తక్కువ ఖర్చుతో భూమికి తెచ్చేంత టెక్నాలజీ ఇప్పటికైతే మన దగ్గర లేదు.
ప్రస్తుతం భూమి లోపల ఎక్కడెక్కడ బంగారం ఉందో ఈజీగా కనిపెట్టగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. కారణం అద్భుతమైన టెక్నాలజీ డెవలప్మెంటే. అదే 1965లో కార్లిన్ దగ్గర్లోని ఓ గనిలో బంగారం ఉందో లేదో తెలుసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. చివరకు ఆశించిన స్థాయిలో బంగారం లేదని తేలింది. ఇప్పుడలా కాదు... ఎంత బంగారం ఉందో కచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ బంగారాన్ని శుద్ధి చేశాక... సైనైడ్ ద్రావకాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. అందుకే అసలీ గోల్డ్ తవ్వకాలు పూర్తిగా ఆపేయాలనీ, ఉన్న బంగారం నిల్వలనే వాడకంలోకి తేవాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి :
అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...
ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం
మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి
ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold prices, Information Technology, Technology