ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు కొంతవరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ సంస్థలు స్మార్ట్ఫోన్లకు అదనపు ఫీచర్స్ జోడిస్తున్నాయి. ధరను బట్టి కొత్తగా అందిస్తున్న ఫీచర్లు మారుతున్నాయి. వీటిల్లో కెమెరా సామర్థ్యం మెరుగుపడచడంపై Apple, Samsung వంటి పెద్ద కంపెనీలు దృష్టి పెట్టాయి. నాణ్యత పరంగా ఏమాత్రం రాజీపడకుండా డిజిటల్ కెమెరా అనుభూతిని స్మార్ట్ఫోన్ల ద్వారా కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ సంవత్సరం వచ్చిన ఫోన్లలో.. ఉత్తమ కెమెరాలతో ఉన్న వాటిని చూద్దాం.
1. iPhone 12 Pro, iPhone 12 Pro Max
ఈ సంవత్సరం Apple సంస్థ iPhone 12 సిరీస్‌లో రెండు 5G స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. iPhone 12 Pro 6.1-అంగుళాలు, iPhone 12 Pro Max 6.7-అంగుళాల డిస్ప్లేతో, 3-కెమెరా సెటప్‌తో లభిస్తున్నాయి. వీటిలో ఉండే అల్ట్రా వైడ్ కెమెరా, వైడ్ కెమెరా, టెలీఫోటో లెన్స్ వంటివి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. iPhone 12 Proతో పోలిస్తే.. Pro Maxలోని వైడ్ కెమెరా సెన్సార్లు 47 శాతం పెద్దగా ఉన్నాయి. ఇది తక్కువ కాంతి ఉండే లో-లైట్ కండిషన్లలో కూడా క్వాలిటీ ఫోటోలను తీయగలదు. iPhone 12 Proలో 4x ఆప్టికల్ జూమ్ కెపాసిటీ, iPhone 12 Pro Maxలో 5x జూమ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు ఐఫోన్లలో లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫోటో తీయగలిగే LIDAR సెన్సార్లు ఉన్నాయి. ఎక్స్పోజర్ను ఆటోమేటిగ్గా కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ హెచ్డీఆర్, యాపిల్ కొత్తగా అభివృద్ధి చేసిన ProRAW ఫోటో ఫైల్ వంటి డిజిటల్ కెమెరా ఫీచర్లతో ఈ కెమెరాలు పనిచేస్తాయి. చాలా రివ్యూలలో ఇవి బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కెమెరా రేటింగ్‌ను అందుకున్నాయి.
Samsung Galaxy S20 స్మార్ట్‌ఫోన్‌లో హై ఎండ్ 108MP కెమెరా ఉంది. ఇది అద్భుతమైన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంట్లో ఆప్టికల్, డిజిటల్ జూమ్ ఆప్షన్లు ఉండే 100x జూమ్ కెపాసిటీ ఉంది. కానీ ఎక్కువ దూరంలో ఉండే వాటిని డిజిటల్ జూమ్‌తో ఫోటో తీస్తే క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు 4x నేటివ్ ఆప్టికల్ జూమ్ ఉండే టెలిఫోటో లెన్స్ ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఉన్నాయి. S20 సిరీస్‌లో వచ్చిన అన్ని ఫోన్లలో 8K రిజల్యూషన్ వీడియోలను రికార్డు చేయవచ్చు. అందువల్ల వీటిల్లో తక్కువ ధర ఉండే మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.
3. Google Pixel 5
ఇతర పెద్ద సంస్థల స్మార్ట్ఫోన్లతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ ఫోన్ల ధర తక్కువగా ఉంటుంది. iPhone 12 Pro Max, Samsung Galaxy S20 Ultra మోడళ్లకు బదులుగా కస్టమర్లు Pixel 5ను ఎంచుకోవచ్చు. దీని ధర కూడా 699డాలర్ల వరకు తక్కువగా ఉండటం విశేషం. Pixel 5 ఫోన్లలో వెనుక వైపు 12.2MP, 16MP సామర్థ్యం ఉండే రెండు అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉంటాయి. ఇవి వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఉండే కెమెరా పనితీరుతో సంతృప్తినిస్తాయి.
చైనాకు చెందిన హువావే సంస్థ నుంచి వచ్చిన P40 Pro స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే కెమెరా సెటప్ ఉంది. దీంట్లో ప్రత్యేకమైన 10x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుంది. ఇది Samsung S20 Ultraలో ఉండే 4x ఆప్టికల్ జూమ్ కెపాసిటీని మించి ఉండటం విశేషం. P40 Proలో ఉండే స్మార్ట్‌ఫోన్ కెమెరా అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నట్లు DxOMark రివ్యూ తెలిపింది. కానీ Huawei ఉత్పత్తులను అమెరికాలో బ్యాన్ చేశారు. తమ దేశంలో గూఢచర్యం కోసం హువావే ఫోన్లను చైనా ఉపయోగిస్తోందనే ఆరోపణలతో ట్రంప్ ఈ కంపెనీని యూఎస్‌లో బ్యాన్ చేశారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.