Home /News /technology /

YEAR ENDER 2021 TWITTER BLUE TICK TO SUPER FOLLOWS TWITTER ADDS MANY FEATURES IN 2021 SS GH

Twitter 2021 Features: ఈ ఏడాది ట్విట్టర్​లో భారీ మార్పులు... కొత్తగా వచ్చిన, తొలగించిన ఫీచర్లివే

Twitter 2021 Features: ఈ ఏడాది ట్విట్టర్​లో భారీ మార్పులు... కొత్తగా వచ్చిన, తొలగించిన ఫీచర్లివే
(ప్రతీకాత్మక చిత్రం)

Twitter 2021 Features: ఈ ఏడాది ట్విట్టర్​లో భారీ మార్పులు... కొత్తగా వచ్చిన, తొలగించిన ఫీచర్లివే (ప్రతీకాత్మక చిత్రం)

Twitter 2021 Features | మీరు ట్విట్టర్ యూజరా? ట్విట్టర్ ఎక్కువగా వాడుతుంటారా? మరి ఈ ఏడాది ట్విట్టర్‌లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటీ? ఏఏ ఫీచర్స్‌ని ట్విట్టర్ తొలగించింది? తెలుసుకోండి.

ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు, ఫీచర్లతో వినియోగదారులకు అత్యంత చేరువైంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లకు మెరుగైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, ట్విట్టర్ (Twitter) ఎంతో సురక్షితమని చెప్పాలనే లక్ష్యంతో కొత్త అప్‌డేట్లను ప్రవేశపెట్టింది. 2021 మూడో త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే మానిటైజ్ అయిన యాక్టివ్ యూజర్ల సంఖ్య 13 శాతం పెరిగి 211 మిలియన్లకు చేరుకుందని ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ పేర్కొంది. ఈ ఏడాది ట్విట్టర్ స్పేసెస్​ను కూడా తీసుకొచ్చామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కొన్ని ఫీచర్లను తొలగించింది కూడా. ఈ నేపథ్యంలో 2021లో ట్విట్టర్ తీసుకొచ్చిన, తొలగించిన ఫీచర్లు, అప్‌డేట్ల గురించి ఇప్పుడు చూద్దాం.

జనవరి 2021.. బర్డ్ వాచ్ (Birdwatch)


తప్పుదారి పట్టించే ట్వీట్​లకు అవసరమైన నోట్స్​ను జోడించేందుకు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ బర్డ్​ వాచ్​ను ప్రారంభించింది. పైలట్​లో ఉన్న వ్యక్తులు తప్పుదారి పట్టించే ట్వీట్​లను కలిగి ఉన్నారని తెలుపుతుంది. అంతేకాకుండా ఈ బర్డ్​వాచ్ ట్విట్టర్ ప్రత్యేకమైన విభాగంలో ఉంది. ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకున్న పైలట్​ వ్యక్తులు మాత్రమే తప్పుడు సమాచారాన్ని గుర్తించి, వాటిని తిప్పికొడుతూ పోస్టులను రాయగలరు. వారి నోటిఫికేషన్​లు పైలట్​ గ్రూప్ వెలుపల ఉన్న యూజర్లకు ట్విట్టర్లో కనిపించవు. కానీ బర్డ్​ వాచ్ సైట్​లో కనిపిస్తాయి. ప్రస్తుతం బర్డ్ వాచ్ ట్విట్టర్​లో టెస్టింగ్ దశలో ఉంది.

Jio 1.5GB Data plans: జియో యూజర్లకు రోజూ 1.5జీబీ డేటా ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

మార్చి 2021- పెరిస్కోప్ (Periscope)


గత రెండేళ్లుగా తగ్గుతున్న వినియోగం, హై సపోర్టింగ్ కాస్ట్ కారణంగా 2015లో కొనుగోలు చేసిన ఈ పెరిస్కోప్​ను షట్​ డౌన్ చేసింది.​

మే 2021- ట్విట్టర్ స్పేసెస్ (Twitter Spaces)


ట్విట్టర్ ప్లాట్‌ఫాంలో ప్రత్యక్ష ఆడియో సంభాషణల కోసం స్పేసెస్​ను తీసుకొచ్చింది. క్లబ్​హౌస్​కు పోటీగా ట్విట్టర్ స్పేసెస్​లో అనేక ఫీచర్లను జోడించింది. ట్విట్టర్ ప్లాట్​ఫాంలో చర్చల రికార్డింగ్​ను వినడానికి, వినియోగదారులకు పాడ్​కాస్ట్ లాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది.

ఆటో క్రాప్ (Auto-Crop)


ఆటో క్రాప్ ఫీచర్‌ను ట్విట్టర్ తొలగించినప్పటి నుంచి స్టాండర్డ్ యాస్పెక్ట్ రేషియో ఇమేజ్ అన్ క్రాప్​లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ట్వీట్ రాసేవారు పోస్ట్ చేయడానికంటే ముందే ట్విట్ కంపోజర్ టూల్​లో ఇమేజ్ ఎలా ఉంటుందో ప్రివ్యూ చూడవచ్చు.

Moto G51 Sale: కాసేపట్లో మోటో జీ51 సేల్... ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్

టిప్స్ (Tips)


ట్విట్టర్లో వినియోగదారులు వారికి ఇష్టమైన వాయిస్​లకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ టిప్స్ ఉపయోగపడతాయి. పేపాల్, పాట్రియోన్, రేజర్ పే లాంటి తదితర థర్డ్ పార్టీ సర్వీసుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. వ్యక్తులు వారి అకౌంట్ సెట్టింగ్స్ ద్వారా ప్రొఫైల్​కు టిప్స్ ను జోడించడాన్ని ఎంచుకోవచ్చు. సెప్టెంబరులో ట్విట్టర్ కూడా బిట్​కాయిన్ ఉపయోగించే టిప్​ ఆప్షన్​ను తీసుకొచ్చింది.

న్యూ వెరిఫికేషన్ అప్లికేషన్


ఈ సంవత్సరం ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్ కోసం పబ్లిక్ అప్లికేషన్​లను మరోసారి సమీక్షించడం ప్రారంభించింది. ఫలితంగా అర్హత ప్రమాణాలు మరింత పారదర్శకంగా మారాయి. ఆటోమేటిక్ ఖాతాలతో స్వీయ గుర్తింపును అనుమతించడానికి అకౌంట్ లేబుల్​ను రూపొందించడం ప్రారంభించింది. ఈ ఆటోమేటిక్ ఖాతాలు ప్రతిరోజూ ఉపయోగకరమైన సమాచారాన్ని కనుగొనడంలో వ్యక్తులకు సహాయపడతాయి.

జూన్ 2021- ట్విట్టర్ బ్లూ (Twitter Blue)


ట్విట్టర్ బ్లూ అనేది ఓ సబ్​స్క్రిప్షన్ సర్వీస్. ట్వీట్లను రద్దు చేయగల సామర్థ్యం, ప్రకటనలు లేకుండా కొన్ని వార్తా కథనాలను చదవడం లాంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. అమెరికాలో నెలకు 2.99 డాలర్లు(రూ.222) ధరతో ప్రకటనలు లేకుండా వార్తా కథనాలను చదవడం, లాంగ్ వీడియోలను అప్​లోడ్ చేయడం, ట్విట్టర్ యాప్​లో నేవిగేషన్ బార్​ను కస్టమైజ్ చేయడం లాంటి సేవలు పొందవచ్చు.

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్... ఇక ఆ సమస్యకు చెక్

ఫెమినైన్ అరబిక్ (Feminine Arabic)


అరబిక్ ఫెమినైన్ ఫామ్​ను​ సపోర్ట్ చేసేందుకు ట్విట్టర్ కొత్తగా లాంగ్వేజ్ సెట్టింగ్స్​ను లాంచ్ చేసింది. ఇంతకు ముందు ట్వీట్​ను పురుషులను పిలిచినట్లు సంబోధించేవారు. ఇప్పుడు ఉమెన్ ఫామ్​ ప్రారంభించారు.

టిక్కెటెడ్ స్పేసెస్ (Ticketed Spaces)


ట్విట్టర్ ఈ సరికొత్త టిక్కెటెడ్ స్పేసెస్​ను రూపొందించింది. దీని ద్వారా క్రియేటర్లు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. డైరెక్ట్ ఆడియో రూమ్స్, టిక్కెట్ ధరను ఛార్జ్ చేయడం ద్వారా అందుకోవచ్చు. క్రియెటర్లు ఓ నిర్దిష్ట మార్కును చేరుకునే వరకు ఈ టిక్కెట్ స్పేసెస్ నుంచి సంపాదించిన ఆదాయంలో 97 శాతం వరకు అందుకుంటారు.

జులై 2021..


తప్పుడు సమాచారం లేబుల్స్ అప్‌డేట్..
ట్వీట్ ఎందుకు తప్పుదారి పట్టించవచ్చో తెలుసుకునేందుకు ట్విట్టర్ ఈ నూతన లేబుల్ డిజైన్​ను టెస్ట్ చేయడం ప్రారంభించింది.

ఆగస్టు 2021.. ఫ్లీట్స్ (Fleets)


వీటిని ప్రారంభించిన 8 నెలల తర్వాత ఆగస్టు 3న ట్విట్టర్ షట్ డౌన్ చేసింది. ఆశించిన విధంగా ఫ్లీట్స్​తో సంభాషణల్లో చేరే నూతన యూజర్ల సంఖ్య పెరగడం లేనందున దీన్ని మూసివేసినట్లు కంపెనీ పేర్కొంది.

రెవ్యూ సబ్​స్క్రిప్షన్(Revue Subscription)..


ఈ ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ తన వాణిజ్యాన్ని విస్తరించేందుకు, ట్విట్టర్​లో వర్క్​ను పంపిణీ చేసే రచయితలకు మరినీ ఫీచర్లను అందించే ప్రయత్నంలో భాగంగా, ఉచితంగా న్యూస్ లెటర్లను ప్రచురించడానికిగానూ రెవ్యూను కొనుగోలు చేసింది. ప్రస్తుతానికి రెవ్యూ సబ్‌స్క్రిప్షన్ బటన్ ఆండ్రాయిడ్, వెబ్‌ల్లో మాత్రమే టెస్ట్ గ్రూప్ కోసం అందుబాటులో ఉంది.

Flipkart Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇదే లాస్ట్ ఛాన్స్... ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ సేల్

సెప్టెంబరు 2021.. సేఫ్టీ మోడ్ (Safety Mode)


సేఫ్టీ మోడ్​ను మహిళా జర్నలిస్టులకు, అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులతో సహా చిన్న సమూహం కోసం ట్విట్టర్ పరీక్షిస్తున్న ఓ ఫీచర్. ఇది ట్వీట్‌ల రిసీవింగ్ ఎండ్​లో హానికరమైన వ్యాఖ్యలను, కామెంట్స్ వ్యాప్తిని తగ్గించడానికి రూపొందించారు. అవమానకరమైన లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు, దుర్భాషలను పంపే ఖాతాలను ఈ సేఫ్టీ మోడ్ తాత్కాలికంగా ఆటో-బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెట్టింగ్స్​ను మాత్రమే ఐఓఎస్, ఆండ్రాయిడ్ లో ట్విట్టర్ టెస్ట్​ చేస్తోంది.

సూఫర్ ఫాలోస్ (Super Follows)


పేమెంట్ చేసే సబ్​స్క్రైబర్ల కోసం ఉద్దేశించిన ఈ ట్వీట్లను షేర్ చేయడం ద్వారా క్రియేటర్లకు నెలవారీ ఆదాయాన్ని పొందే అవకాశాన్ని సూపర్ ఫాలోస్ అందిస్తుంది. దీని ద్వారా తర్వాతి స్థాయి సంభాషణలు సృష్టించవచ్చు.

డిసెంబరు 2021- ఆటోమేటిక్ క్యాప్షన్స్ (Automatic Captions)


ఈ వారంలోనే ఆటోమేటిక్ క్యాప్షన్‌లను విడుదల చేసింది ట్విట్టర్. ఆటో-క్యాప్షన్స్ ఫీచర్ ప్రస్తుతం 37 భాషలకు మద్దతు ఇస్తుంది. అనువాదం ప్రత్యక్ష ప్రసారం కానందున, క్లిప్‌ను అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించిన డివైజ్ భాషలో క్యాప్షన్లు చూపుతాయి. iOS, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ మ్యూట్ చేసిన వీడియోలలో ఆటో క్యాప్షన్లు కనిపిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు