YEAR ENDER 2021 REDMI NOTE 10 PRO MAX TO POCO X3 PRO KNOW ABOUT POPULAR SMARTPHONES RELEASED UNDER RS 20000 IN 2021 SS
Year Ender 2021: ఈ ఏడాది రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Year Ender 2021: ఈ ఏడాది రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Year Ender 2021 | డిసెంబర్ ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఇక ఈ ఏడాదిలో కొత్త స్మార్ట్ఫోన్ల విడుదల దాదాపుగా లేనట్టే. మరి ఈ ఏడాది యూజర్లను ఆకట్టుకున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవి? రూ.20,000 లోపు బడ్జెట్లో బాగా పాపులర్ అయిన మొబైల్ ఏవి? తెలుసుకోండి.
ఈ ఏడాది కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని కొనలేకపోయారా? వచ్చే ఏడాది మంచి స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్నారా? 2021 లో రిలీజ్ అయిన స్మార్ట్ఫోన్లు చాలా ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్లో చూస్తే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్11టీ 5జీ, రియల్మీ 8 ప్రో, పోకో ఎక్స్3 ప్రో లాంటి మోడల్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు సెగ్మెంట్లో చాలా మొబైల్స్ రిలీజ్ అయినా కొన్ని మాత్రమే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాయి. మరి రూ.20,000 లోపు బడ్జెట్లో 2021 లో పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకోండి.
Redmi Note 10 Pro Max:రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్మీ నుంచి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 108మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.19,999.
Redmi Note 11T 5G: రెడ్మీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన రెండో 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్11టీ 5జీ. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.16,999.
Lava Agni 5G: కొద్ది రోజుల క్రితం మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన లావా మొబైల్స్ నుంచి రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీ. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర రూ.19,999.
iQOO Z3:ఐకూ నుంచి వచ్చిన ఐకూ జెడ్3 స్మార్ట్‌ఫోన్ కూడా పాపులర్ అయింది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 55వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్, 64మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.19,990.
Realme 8 Pro: రియల్మీ 8 సిరీస్‌లో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ రియల్మీ 8 ప్రో. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. రియల్మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జర్ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.19,999.
Motorola Moto G60: మోటోరోలా నుంచి మోటో జీ60 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 108మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.15,999.
Poco X3 Pro: పోకో నుంచి రిలీజ్ అయిన పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 48మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రారంభ ధర రూ.18,999.
Realme X7:రియల్మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4310ఎంఏహెచ్ బ్యాటరీ, 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.19,999.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.