ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2021 లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వరుసగా మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, మోటోరోలా లాంటి కంపెనీలన్నీ పోటాపోటీగా కొత్త మోడల్స్‌ని పరిచయం చేశాయి. రూ.10,000 లోపు బడ్జెట్‌లో అనేక కొత్త మోడల్స్ వచ్చాయి. వీటిలో పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్స్ చాలానే ఉన్నాయి. రూ.10,000 లోపు బడ్జెట్‌లోనే డ్యూయెల్ కెమెరా సెటప్, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీ లాంటి ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అవసరాలు తీర్చేందుకు అనేక ఫీచర్స్ అందించాయి కంపెనీలు. మరి 2021 లో ఇండియన్ మార్కెట్‌లో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకోండి.
Samsung Galaxy F02s: సాంసంగ్ నుంచి కొద్ది రోజుల క్రితం బడ్జెట్ సెగ్మెంట్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.9,499.
Smartphone Tips: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ స్మార్ట్‌ఫోన్ స్పీడ్ అదిరిపోతుంది
Realme Narzo 30A: రియల్‌మీ నార్జో సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ పాపులర్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.8,999.
Nokia C20 Plus: నోకియా సీ20 ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు క్లీన్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తోంది. 6.5 అంగుళాల డిస్‌ప్లే, యూనిసోక్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గూగుల్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. వెనుకవైపు 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ధర రూ.8,999.
WhatsApp Web: ఇక వాట్సప్ వెబ్ వాడటానికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు
Motorola Moto E7 Plus: నోకియా తర్వాత క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించడంలో మోటోరోలా ముందు ఉంటుంది. మోటోరోలా నుంచి వచ్చిన మోటో ఇ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, గూగుల్ అసిస్టెంట్ బటన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 48 + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 4జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ ఉంది. ధర రూ.8,999.
Infinix Hot 11S: ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.10,000 లోపే పొందొచ్చు. ఇందులో 6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infinix, Mobile News, Mobiles, Motorola, Nokia, Realme, Realme Narzo, Samsung, Smartphone, Year Ender