Year End 2019 : ఈ ఏడాది రోదసిలో జరిగిన అద్భుతాలు

Year End 2019 : ఈ అనంత విశ్వాన్ని జల్లెడ పట్టేకొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం అలాంటి కొత్త విషయాలు ఏం తెలిశాయో ఓసారి మననం చేసుకుందాం.

news18-telugu
Updated: December 20, 2019, 2:49 PM IST
Year End 2019 : ఈ ఏడాది రోదసిలో జరిగిన అద్భుతాలు
Year End 2019 : ఈ ఏడాది రోదసిలో జరిగిన అద్భుతాలు (credit - NASA)
  • Share this:
అంతరిక్ష అంశాలకు సంబంధించి 2019 ఓ ఆసక్తికర సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చెప్పుకోతగ్గ విశేషాలు చాలా ఉన్నాయి. చాలా విశేషాలు జరిగాయి. ఎప్పుడో 1954 అక్టోబర్‌లో మొదటి శాటిలైట్ స్పుత్నిక్-1 అంతరిక్షంలో విహరించింది. ఆ తర్వాత 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డ్ సృష్టించారు. ఇక 1969లో చందమామపై కాలు పెట్టడం, 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించడం, 2004లో తొలి ప్రైవేట్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లడం అన్నీ అద్భుతాలే. అదే విధంగా ఈ ఏడాది కూడా అలాంటి చెప్పుకోతగ్గ సంఘటనలు కొన్ని జరిగాయి. అవేంటో సింపుల్‌గా, చకచకా తెలుసుకుందాం.


1. January 2019 - సరిగ్గా న్యూఇయర్ రోజున... నాసాకి చెందిన న్యూ హారిజన్స్ స్పేస్ క్రాఫ్ట్... అల్టిమా థులే వరకూ దూసుకెళ్లింది. ఇప్పటివరకూ మన సౌర కుటుంబంలో అత్యంత ఎక్కువ దూరంలో ఉన్న శకలాన్ని చేరుకోవడం ఇదే తొలిసారి. ఇదే నెలలో చైనా... తన చాంగే-4 ల్యాండర్‌ను చందమామ అవతలివైపున ల్యాండ్ చేసింది.

2. February 2019 - నాసా మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్... అరుణగ్రహం (అంగారక గ్రహం)పై తవ్వకాలు జరిపింది. 5 మీటర్ల లోతు తవ్వాలనుకున్న ఈ మిషన్... 30 సెంటీమీటర్లు తవ్విన తర్వాత పాడైపోయింది. ఇదే నెలలో ఇజ్రాయెల్‌కు చెందిన స్పేస్ఐఎల్ కంపెనీ... తన మొదటి మూన్ ల్యాండర్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 19న చందమామ... సూపర్ మూన్‌గా కనిపించి అలరించింది. ఇదే నెలలో జూనో ఆర్బిటర్... గురుగ్రహానికి సంబంధించి అద్భుతమైన ఫొటోలు తీసింది. జపాన్... ర్యూగూ గ్రహశకలం నుంచీ హయబుసా2 ద్వారా శాంపిల్స్ సేకరించింది.

3. March 2019 - స్పేస్ ఎక్స్ సంస్థ తమ డ్రాగన్ 2 స్పేస్ క్రాఫ్ట్‌ని పరీక్షించి చూసింది. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విజయవంతంగా చేరింది.

4. April 2019 - నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రూబ్... దాదాపు సూర్యుణ్ని చేరింది. ఇప్పటివరకూ అంత దగ్గరగా మరే ఆర్బిటరూ వెళ్లలేదు. స్పేస్ ఎక్స్ మరో ఫాల్కన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.5. May 2019 - ఇటా అక్వారిడ్ ఉల్కాపాతం మే 6న కనిపించింది. హేలీ తోక చుక్క నుంచీ భూమివైపు వస్తున్నవే ఈ ఉల్కలు. చందమామపై 15 మీటర్ల వెడల్పున్న ఓ తాజా పగులును వ్యోమగాములు గుర్తించారు.

6. June 2019 - నాసాకి చెందిన మార్స్ రికొన్నైసాన్స్ ఆర్బిటర్... మార్స్‌కి చందిన ఆసక్తికర ఫొటోలు తీసింది. మార్స్‌పై మీథేన్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు నాసా క్యూరియోసిటీ రోవర్ గుర్తించింది. అంటే మనుషులు జీవించేందుకు ఛాన్స్ ఉన్నట్లే. చందమామ స్ట్రాబెర్రీ మూన్‌లా కనిపించి అలరించింది. జూపిటర్ ఉపగ్రహం... యూరోపాపై సాల్ట్ వాటర్‌ను కనుక్కున్నారు.

Source : NASA


7. July 2019 - బ్లాక్ హోల్స్ ఏర్పడటానికి నక్షత్రాలు పేలిపోవాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔమువామువా గ్రహశకలం... ఏలియన్ స్పేస్‌షిప్ కాదని తేల్చారు.

8. August 2019 - క్రాబ్ నెబ్యులా (క్రాబ్ నక్షత్ర మండలం)లో అత్యంత ఎక్కువ ఎనర్జీగల ప్రోటాన్లను గుర్తించారు. అతి పెద్ద అల్ట్రా మాస్సివ్ బ్లాక్ హోల్‌ని కూడా కనిపెట్టారు. అది 4000 కోట్ల సూర్యుళ్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది.

9. September 2019 - ఈ నెలలో ఇస్రో పంపిన చంద్రయాన్-2 నుంచీ విడిపోయిన విక్రమ్ ల్యాండర్... చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. మార్స్‌కి మనుషుల్ని పంపేందుకు స్పేస్ ఎక్స్... ల్యాండింగ్ సైట్లను ఎంపిక చేసింది. తొలిసారిగా బ్లాక్ హోల్‌ను ఫొటో తీశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సిమెంట్ తయారుచేశారు.

Source: SpaceX


10. October 2019 - శనిగ్రహ ఉపగ్రహం ఎన్‌సెలాడస్‌పై జీవం ఉందనేందుకు ఆధారాల్ని సేకరించినట్లు సైంటిస్టులు తెలిపారు. చందమామ మట్టిలో ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించారు.

11. November 2019 - నవంబర్ 2న శనిగ్రహం ముందు నుంచీ చందమామ వెళ్లింది. నవంబర్ 11న సూర్యుడి ముందు నుంచీ బుధగ్రహం వెళ్లింది. మళ్లీ 2039లో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.

12. December 2019 - ర్యుగు గ్రహశకలంపై మట్టిని సేకరించిన జపాన్ ల్యాండర్ హయబుసా2... తిరిగి భూమివైపు జర్నీ మొదలుపెట్టింది. ఇది డిసెంబర్ 2020న భూమిని చేరుతుంది.
Published by: Krishna Kumar N
First published: December 20, 2019, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading