హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Year End 2019 : జాబిల్లి వైపు ఇస్రో మరిన్ని అడుగులు...

Year End 2019 : జాబిల్లి వైపు ఇస్రో మరిన్ని అడుగులు...

Year End 2019 : ఈ సంవత్సరం ఇస్రో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చంద్రయాన్-2 ద్వారా ఎన్నో రికార్డులను తన పేరున రాసుకుంది ఇస్రో.

Year End 2019 : ఈ సంవత్సరం ఇస్రో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చంద్రయాన్-2 ద్వారా ఎన్నో రికార్డులను తన పేరున రాసుకుంది ఇస్రో.

Year End 2019 : ఈ సంవత్సరం ఇస్రో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చంద్రయాన్-2 ద్వారా ఎన్నో రికార్డులను తన పేరున రాసుకుంది ఇస్రో.

Mission Chandrayaan-2 : చంద్రయాన్-2... ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలంతా ఆసక్తిగా చూసిన ప్రయోగం ఇది. ఇప్పటివరకూ చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్లు, రోవర్లు దిగాయి కానీ... దక్షిణ ధ్రువంపై దిగలేదు. అలాంటి రికార్డును తన పేరున రాసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ప్రయత్నించడం ఇస్రో చరిత్రలో ఓ మైలురాయే. ఎప్పుడో 50 ఏళ్ల కిందట సైకిళ్లపై రాకెట్ల పనిముట్లను తీసుకెళ్లిన చరిత్ర ఇస్రోది. అలాంటి స్థాయి నుంచీ ఈ రోజున ప్రపంచంలో అతి ఎక్కువ శాటిలైట్లను ఒకేసారి రోదసిలో రిలీజ్ చేసిన రికార్డులు తన పేరును రాసుకొని సగర్వంగా నిలుస్తోంది ఇస్రో. చంద్రయాన్-2 అనేది ప్రతి భారతీయుడి కల. చందమామపై మనమూ అడుగుపెట్టాలనేది భారతీయులందరి ఆశ. ఈ కలలను నిజం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ క్రమంలో వేసిన మరో గొప్ప అడుగే చంద్రయాన్-2.

చంద్రయాన్-1 ద్వారా చందమామపై నీటి జాడల్ని గుర్తించిన ఇస్రో... చంద్రయాన్ 2 ద్వారా... రూ.978 కోట్ల ఖర్చుతో ఆర్బిటర్, విక్రం అని పిలిచే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్‌ను చందమామ చెంతకు పంపించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ బరువు 3,877 కేజీలు. చంద్రయాన్ 1 కంటే ఇది నాలుగు రెట్లు బరువు ఎక్కువ. ప్రస్తుతం ఈ ఆర్బిటర్ వంద శాతం పనిచేస్తోంది. మరో ఆరేళ్ల పాటూ దీని సేవల్ని అందించనుంది. ఐతే... ప్రయోగాత్మకంగా దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రమ్ ల్యాండర్... చందమామపై దిగే సమయంలో... సిగ్నల్స్ పోవడం వల్ల... క్రాష్ ల్యాండింగ్ అవ్వడంతో... దాంతోపాటూ అందులో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ కూడా పనిచేయకుండా పోయింది. అయితేనేం... ఈ ప్రయోగంతో ఇస్రో ఎన్నో నేర్చుకుంది. లక్ష్యం దిశగా మరిన్ని అడుగులు వేస్తోంది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి... గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఇక ఇప్పుడు చంద్రయాన్-3 కోసం నిర్మాణం, ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చంద్రయాన్-3 : చంద్రయాన్ 2 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో... మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. 2020 నవంబర్‌లో చంద్రయాన్-3ని ప్రయోగించబోతోంది. ఇప్పటికే ఈ మిషన్‌పై శాస్త్రవేత్తలంతా తలమునకలయ్యారు. చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి... చంద్రయాన్ 3లో ఆర్బిటర్ అనేది ఉండదు. ఓన్లీ ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ఇస్రో... చంద్రయాన్ 3లో భాగమైన ల్యాండర్‌ను ఎక్కడ దింపాలి, రోవర్‌ ఎలా ఉండాలి? వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. ఈసారి ల్యాండర్‌కి లెగ్స్ (కాళ్లు) అత్యంత బలంగా ఉండేలా చెయ్యబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే... చంద్రయాన్ 2లో ల్యాండర్ కాళ్లు మరీ అంత బలమైనవేమీ కాదు. అందువల్ల అది వేగంగా పడినప్పుడు... దానికి శక్తి సరిపోలేదని అర్థమైంది. మొత్తంగా కొత్త ల్యాండర్, కొత్త రోవర్‌ను తయారుచేస్తారని తెలిసింది.

ఇలా కొన్ని ప్రయత్నాలు ఫలించకపోయినా... వాటి నుంచీ కొత్త విషయాలు తెలుసుకొని... చందమామపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు ఇస్రో ఉన్నత లక్ష్యాలతో ముందుకుసాగుతోంది. 2020లో మరిన్ని విజయాలతో దూసుకుపోవాలని కోరుకుందాం.


Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :


అయ్యో... ఫీలైపోతున్న రష్మీ గౌతమ్... ఆ మూగ జీవాల కోసం...

నా అందానికి కారణం ఆమే... సీక్రెట్ చెప్పిన అనసూయ

ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

"హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్...

CISF ఆఫీసర్ అరెస్ట్... చివర్లో ట్విస్ట్...

First published:

Tags: AP News, Chandrayaan-2, ISRO, Telugu news, Telugu varthalu, Yearender 2019

ఉత్తమ కథలు