Yamaha: యమహా FZ బైక్‌ను మీ ఫోన్‌తో లాక్ చేయొచ్చు

దేశంలోని ద్విచక్ర వాహన వినియోగదారులకు సరికొత్త సేవలందించాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల చైర్మన్ మోటోఫుమి శితారా చెబుతున్నారు.

news18-telugu
Updated: October 17, 2020, 4:32 PM IST
Yamaha: యమహా FZ బైక్‌ను మీ ఫోన్‌తో లాక్ చేయొచ్చు
Yamaha: యమహా FZ బైక్‌ను మీ ఫోన్‌తో లాక్ చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం, image: Yamaha)
  • Share this:
యమహా సంస్థ తమ లగ్జరీ బైక్‌లకు సరికొత్త సాంకేతికను జోడిస్తోంది. FZS-FI Dark knight BS-VI వేరియంట్ బైక్‌లకు యాప్‌ ఎనేబుల్డ్ బ్లూటూత్ టెక్నాలజీని అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకు యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఎక్స్ పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసింది. FZ-FI, FZS-FI (150cc) BS-VI సిరీస్‌ బైక్లను ఈ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఆథరైజ్డ్ యమహా డీలర్‌షిప్‌లలో డివైజ్‌లను కొనుగోలు చేసి యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ X సేవలను పొందవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తరువాత FZS-FI Dark knight ధరలను సవరించారు. ఈ బైక్ తాజా ధర రూ.1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్, దిల్లీ). ఈ సరికొత్త ఫీచర్‌తో లభించే FZS-FI డార్క్ నైట్ బైక్‌లను నవంబర్ 1 నుంచి అన్ని యమహా ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌లలో అమ్మకానికి ఉంచుతామని యమహా సంస్థ తెలిపింది.

ఆరు కొత్త ఫీచర్లు



యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ యాప్‌లో ఆరు ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ను ఒక్కసారి తాకితే రైడర్‌కు బైక్‌ కనెక్ట్ అయ్యేలా యాప్‌ను రూపొందించారు. మొబైల్ ద్వారా ఆన్సర్ బ్యాక్, ఈ-లాక్, లొకేట్ మై బైక్, హజార్డ్ వంటి ఫీచర్లను బైక్ రైడర్ యాక్సెస్ చేయవచ్చు. ఈ ఆరు ఫీచర్లతో సరికొత్త సేవలను పొందవచ్చు. ఆన్సర్ బ్యాక్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే బైక్ ఇండికేటర్లు బ్లింక్ అవుతాయి. హారన్ కూడా మోగుతుంది. దీంతో బైక్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. ఈ-లాక్ ఫీచర్ ద్వారా మోటార్ సైకిల్‌ను లాక్ చేయవచ్చు. దొంగతనాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. జియో లొకేషన్‌ ఫీచర్‌ ద్వారా బైక్‌ను ఎక్కడ పార్కింగ్ చేశామో తెలుసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే బైక్ ఇండికేటర్లు పది సెకన్ల వరకు వెలుగుతాయి. వీటితో పాటు హజార్డ్ లైట్స్, రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ రికార్డ్ వంటి ఫీచర్లు ఈ యాప్‌ ద్వారా రైడర్లు పొందవచ్చు.


సౌలభ్యం, భద్రత కోసమే


దేశంలోని ద్విచక్ర వాహన వినియోగదారులకు సరికొత్త సేవలందించాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల చైర్మన్ మోటోఫుమి శితారా చెబుతున్నారు. కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు సరికొత్త రైడింగ్ అనుభూతిని ఇస్తామని ఆయన తెలిపారు. యమహా అందించే మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ యాప్... ఎఫ్‌జెడ్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ప్రాక్టికల్, కన్వీనియెంట్, రిలయబుల్(నమ్మకమైన) బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ అని చెప్పారు. భవిష్యత్తులో ఇతర టూవీలర్లకూ ఈ సేవలను విస్తరిస్తామన్నారు. బైక్‌ రైడర్లకు సౌలభ్యం, భద్రతను అందించాలనే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు


యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ యాప్‌ను ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ అందించే ఫీచర్లను కేవలం రెండు స్టెప్‌ల రిజిస్ట్రేషన్‌తోనే యాక్సెస్ చేసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: October 17, 2020, 4:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading