హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

XLRI Jamshedpur: ప్రముఖ మేనేజ్‌మెంట్ స్కూల్‌ నుంచి ఆన్‌లైన్ కోర్సు.. ఫైనాన్స్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా ప్రారంభం

XLRI Jamshedpur: ప్రముఖ మేనేజ్‌మెంట్ స్కూల్‌ నుంచి ఆన్‌లైన్ కోర్సు.. ఫైనాన్స్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Online Course | గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (XLRI) జంషెడ్‌పూర్, ఫైనాన్స్‌‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌(PGDF)ను ప్రారంభించింది. దీన్ని ఆన్‌లైన్ మోడ్‌లో చేపట్టనుంది.

గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (XLRI) జంషెడ్‌పూర్, ఫైనాన్స్‌‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌(PGDF)ను ప్రారంభించింది. దీన్ని ఆన్‌లైన్ మోడ్‌లో చేపట్టనుంది. వేగంగా మారుతున్న ఫైనాన్స్ రంగంలో విద్యార్థుల కెరీర్‌ను తీర్చిదిద్దమే లక్ష్యమని గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఫైనాన్స్, మేనేజిరియల్ నైపుణ్యాలతో కెరీర్‌ (Career) ను డెవలప్ చేసుకోవడంపై ఆసక్తి ఉన్న నిపుణులకు ఈ ప్రోగ్రామ్ సరిపొతుందని సంస్థ పేర్కొంది.

కోర్సు ప్రణాళికలో భాగంగా ఫైనాన్స్‌లో... సమ్మర్ ఇంటర్న్‌షిప్, పరిశ్రమ లీడర్ల వర్క్‌షాప్ సెషన్‌లు, క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్, ట్రేడింగ్, వాల్యుయేషన్ మాడ్యూల్స్‌లలో 32 ఫౌండేషన్ అధునాతన స్థాయి కోర్సులు ఉన్నాయి. ఫిన్‌టెక్, డిజిటల్ ఫైనాన్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌కు వర్తించే మెషీన్ లెర్నింగ్ టూల్స్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులు లోతైన అవగాహనను పొందుతారని సంస్థ పేర్కొంది.

CUET 2022: సీయూఈటీకి ఆ స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఈ రాష్ట్ర‌ల్లో అంతంతే..

కోర్సు తరగతులను వారాంతాల్లో నిర్వహించనున్నారు. వర్కింగ్ డే తరువాత రోజు సాయంత్రం వీక్షించడానికి సెషన్‌ను రికార్డిండ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొనసాగుతూనే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ఈ కోర్సు్ ఆన్‌లైన్‌ (Online) లో నిర్వహిస్తున్నందున విద్యార్థులు ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చు. వర్చువల్‌గా పీర్-టు-పీర్ ఇంటరాక్షన్‌లను షెడ్యూల్ చేయడం వల్ల ఉపన్యాసాలను ఎప్పుడైనా వీక్షించవచ్చు.

ఈ కోర్సు XLRI జంషెడ్‌పూర్‌లోని క్యాంపస్ (Campus) మాడ్యూల్‌తో ఒక వారం, ముంబైలోని ఇమ్మర్షన్ మాడ్యూల్‌తో మరో వారం ఆన్‌లైన్ తరగతులను మిళితం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులకు సీనియర్ ఫైనాన్స్ నిపుణులు సంస్థలతో సంభాషించే ఫైనాన్స్ ఫంక్షన్‌ల‌పై అవగాహన కల్పించనున్నారు.

ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు తమ వ్యక్తిగత బలాలు, ప్రేరణలను బట్టి అన్ని కోర్సులలో స్వయంగా స్టడీ చేసేవిధంగా నిమగ్నమై ఉండాలని. ముఖ్యంగా అసైన్‌మెంట్‌లు, ఎక్సర్‌సైజులు, వ్యక్తిగత ప్రతిబింబాలు, ఇ-టెక్స్, స్వీయ-అంచనా తదితర అంశాలపై అవగాహన ఉండాలి.

AICTE: ఆన్‌లైన్ కోర్సులపై ప్రతిపాదనలకు ఏఐసీటీఈ ఆహ్వానం.. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై సంస్థ దృష్టి

సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA)కోర్సుకు సంబంధించిన సిలబస్‌ రూపొందిస్తారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ఎంపికలను ముందుకు తీసుకెళ్లడంలో పాల్గొనేవారికి ఈ సిలబస్ సహాయపడుతుంది.

ప్రోగ్రామ్ డైరెక్టర్లుగా డాక్టర్ హెచ్‌కె ప్రధాన్, డాక్టర్ ఎన్ శివశంకరన్ లను నియమించినట్లు ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. వీరికి ఫైనాన్స్ ప్రొఫెసర్లుగా ఎంతో అనుభవం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ప్రధాన్ మాట్లాడుతూ.. PGDF పాఠ్యాంశాలు విస్తృతమైన ఆర్థిక అంశాలకు సంబంధించినవని... విస్తృతమైన పరిశ్రమ సంప్రదింపుల తర్వాత సముచితంగా రూపొందించామని ఆయన తెలిపారు. విద్యార్థులు డిజిటల్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్‌కు వర్తించే డేటా సైన్స్ (Data Science) వంటి అభివృద్ధి చెందుతున్న పరిణామాలపై లోతైన జ్ఞానాన్ని పొందుతారన్నారు.

Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

ఈ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు XLRI పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడంతో పాటు ఇన్‌స్టిట్యూట్ నుండి కెరీర్ గైడెన్స్‌ను పొందే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా, సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన రెగ్యులర్ స్పీకర్ సెషన్‌ల ద్వారా విద్యార్థులకు పరస్పర చర్యలకు అవకాశం కల్పించనున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ ప్రధాన్ తెలిపారు.

First published:

Tags: Career and Courses, EDUCATION, Online Education