Xiaomi Diwali Offers: షియోమీ స్పెషల్ సేల్..స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్​టీవీలపై బంపర్ ఆఫర్స్

(ప్రతీకాత్మక చిత్రం)

దీపావళి పండుగ సందర్భంగా షియోమీ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'దివాలీ విత్ ఎంఐ' అనే పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తన ఉత్పత్తులపై కొనుగోలు దారులకు ఎన్నో ఆఫర్లను ఇచ్చింది. ఇందులో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

  • Share this:
Xiaomi Diwali Offers 2021: దీపావళి పండుగ సందర్భంగా షియోమీ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'దివాలీ విత్ ఎంఐ' అనే పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తన ఉత్పత్తులపై కొనుగోలు దారులకు ఎన్నో ఆఫర్లను ఇచ్చింది. ఇందులో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. షియోమీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎకో సిస్టం ప్రొడక్టులు లాంటి ఎన్నో షియోమీ వస్తువులపై ప్రత్యేక రాయితీలను కల్పించింది. నవంబరు 6 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ లో అబ్బురపరిచే క్యాష్ ప్రైజెస్ ను షియోమీ అందించనుంది. ప్రతి రోజు 64 మంది లక్కీ విన్నర్లకు రూ. 1000 నుంచి 5 లక్షల వరకు ఈ నగదు బహమతి ఇస్తుంది. లక్కీ విన్నర్లకు లక్కీ డ్రా ద్వారా ఓ సెడాన్ కారు, సూపర్ బైక్స్ ను కూడా అందజేయనుంది. ఎంఐ స్టోర్లు, ఎంఐ స్టూడియోలో వీటిని బహుకరిస్తారు.

Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయింది? ఇలా తెలుసుకోండి

ఎంఐ 11ఎక్స్ పై డిస్కౌంట్​..
ఈ సేల్ పీరియడ్ లో ఎంఐ 11ఎక్స్ సిరీస్ లపై గరిష్టంగారూ.3 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది షియోమీ. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న బేస్ వేరియంట్​నురూ.2 వేల డిస్కౌంట్​పై కేవలంరూ.27,999 ధర వద్దకొనుగోలు చేయవచ్చు. ఇక, 8జీబీ ర్యామ్ కలిగి ఉన్న స్టెప్ అప్ వేరియంట్​పై రూ.3 వేల డిస్కౌంట్ అందిస్తోంది.తద్వారా కేవలం రూ. 28,999 వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంఐ 11ఎక్స్ ప్రో మొబైల్ పై కూడా ఇదే రాయితీని ప్రకటించింది. 3 వేలు డిస్కౌంట్ పోగా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.36,999లకు తీసుకోవచ్చు.

ఇవి చదవండి..Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై రాయితీ..
దీపావళి సేల్​లో భాగంగారెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్ మీ 9 సిరీస్ లాంటి మోడళ్లపై రూ.1000ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.4జీబీ, 6జీబీ ర్యామ్ కలిగి ఉన్న రెడ్ మీ నోట్ 10 లైట్ వేరియంట్లపై పై రూ.1000ల డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా వీటినిరూ.12,999లు, రూ.15,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా రెడ్ మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ లో 64జీబీ, 128జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న వేరియంట్లపై వెయ్యి రూపాయల రాయితీ ఇచ్చింది. వీటిని రూ.13,999, రూ.15,999ల ధర వద్దకొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు, రెడ్ మీ 9 సిరీస్ లోని రెడ్ మీ 9, రెడ్ మీ 9 యాక్టివ్ మొబైల్స్ పై రూ.1000ల డిస్కౌంట్ ఇచ్చింది.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నవారు, ఈఎంఐ చెల్లించేవారు 3 వేల క్యాష్ బ్యాక్ పొందవచ్చని షియోమీ స్పష్టం చేసింది. వడ్డీ లేకుండా జీరో డౌన్ పేమెంట్ తో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

షియోమీ స్మార్ట్ టీవీ డిస్కౌంట్..
షియోమీ స్మార్ట్ టీవీలు, రెడ్ మీ స్మార్ట్ టీవీ రేంజ్, ఎంఐ టీవీ సిరీస్ లపై ఈ పండగ సీజన్ లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది.ఈ సేల్​లో రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ పై రూ.3000 నుంచి రూ.5000 వరకు రాయితీ ఇస్తోంది.దీనితో పాటు మరో రెండు రెడ్ స్మార్ట్ టీవీలపై రూ.1500, రూ.2000ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఎంఐ టీవీలపై కూడా భారీ రాయినిస్తున్నట్లు స్పష్టం చేసింది. 32 అంగుళాల నుంచి 55 అంగుళాల సైజ్​లో గల ఎంఐ టీవీలపై రూ.1000నుంచి రూ.3000వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. ఇక, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ఉపయోగిస్తున్నవారికి రూ.3500 విలువ కలిగిన ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా వడ్డీ లేకుండా జీరో డౌన్ పేమెంట్ తో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

షియోమీ ఎకో సిస్టం ఉత్పత్తులపై రాయితీ..
ఎంఐ సేల్ లో దీపావళీ సందర్భంగా మొత్తం ఐదు షియోమి ఎకో ఉత్పత్తులపై తగ్గింపు అందిస్తోంది. వీటిలో ఎంఐ వాట్​ రివాల్వ్​ యాక్టివ్​, ఎంఐ రోబోట్​ వాక్యుమ్​ మోప్​ పీ, ఎంఐ ఎయిర్​ ప్యూరిఫైయర్​ 3, ఎంఐ స్మార్ట్ వాటర్​ ప్యూరిఫయర్​ లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఎంఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ అసలు ధరపై రూ.2 వేల రాయితీ ఇవ్వడంతో దీన్ని రూ.7,999లకు సొంతం చేసుకోవచ్చు. ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ ఎంపీ-పీ రూ.5000 డిస్కౌంట్ ఇవ్వడంతో రూ.19,000లకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎంఐ ఎయిర్ ప్యూరీఫైర్ 2 పై రూ.1000ల రాయితీనివ్వడంతో రూ.9999లకు సొంతం చేసుకోవచ్చు. అయితే ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్(RO+UV)పై రూ.2 వేలు డిస్కౌంట్ ఇవ్వడంతో రూ.10,000ల రిటైల్ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published: