Xiaomi: షావోమీ నుంచి ఆ ఫోన్లు బంద్... ఎందుకో తెలుసా?

Xiaomi | కొత్త సిరీస్‌లు తీసుకొస్తుండటంతో పాత ఫోన్లైన ఎంఐ మ్యాక్స్, నోట్ సిరీస్‌లు ఆపేస్తామని తేల్చేసింది.

news18-telugu
Updated: June 24, 2019, 11:25 AM IST
Xiaomi: షావోమీ నుంచి ఆ ఫోన్లు బంద్... ఎందుకో తెలుసా?
Xiaomi: షావోమీ నుంచి ఆ ఫోన్లు బంద్... ఎందుకో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 24, 2019, 11:25 AM IST
షావోమీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఇక ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్ సిరీస్ ఫోన్లు రిలీజ్ చేయమని అధికారికంగా ప్రకటించింది కంపెనీ. త్వరలో ఎంఐ మ్యాక్స్ 4 వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ... షావోమీ సీఈఓ లీ జున్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఎంఐ మ్యాక్స్ 4 రిలీజ్ చేసే ఆలోచనలో లేమని షావోమీ సీఈఓ తెలిపారు. అంతేకాదు... ఎంఐ నోట్ డివైజ్ కూడా తీసుకొచ్చే ప్రణాళికలు లేవన్నారు. చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఈ విషయాలను వెల్లడించారు షావోమీ సీఈఓ. ప్రస్తుతం షావోమీ, రెడ్‌మీ ఇండిపెండెంట్ బ్రాండ్లుగా మార్కెట్లో ఉన్నాయి. గతంలో షావోమీ సబ్‌బ్రాండ్‌గా రెడ్‌మీ ఉండేది. కానీ తర్వాత రెడ్‌మీ ఇండిపెండెంట్ బ్రాండ్‌గా మారింది. ఆ తర్వాత నుంచి రెడ్‌మీ బ్రాండ్‌తో ఫోన్లు రిలీజయ్యాయి.

ఇకపా షావోమీ ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై దృష్టిపెట్టనుంది. మరోవైపు రెడ్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుంది. ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ బడ్జెట్టే రెడ్‌మీ టార్గెట్. షావోమీ ఫోన్లు కాస్త ఖరీదెక్కువగా ఉంటాయి. షావోమీ నుంచి షావోమీ 9, షావోమీ 9 ఎస్ఈ, షావోమీ మిక్స్ సిరీస్‌లు ఉండగా, కొత్తగా సీసీ సిరీస్ కూడా వస్తోంది. కొత్త సిరీస్‌లు తీసుకొస్తుండటంతో పాత ఫోన్లైన ఎంఐ మ్యాక్స్, నోట్ సిరీస్‌లు ఆపేస్తామని తేల్చేసింది. ఇక రెడ్‌మీలో ప్రస్తుతం 7 సిరీస్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. త్వరలో రెడ్‌మీ కే20, కే20 ప్రో ఫోన్లు రిలీజ్ కానున్నాయి.

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

Bamboo Business: వెదురు పంటతో లక్షల్లో ఆదాయం... ఆ ఐడియా ఇదే

Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి

LIC: మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉందా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...