FAKE MI STORE: షావోమీ పేరుతో భారీ మోసం... మీరూ మోసపోకండి

FAKE MI STORE | ఎంఐ స్టోర్ ఫ్రాంఛైజీ పేరుతో సంప్రదిస్తే... స్థానికంగా ఉండే షావోమీ టీమ్‌ను సంప్రదించాలని, లేదా 1800 103 6286 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని షావోమీ ఇండియా సీఈఓ మను జైన్‌ సూచించారు.

news18-telugu
Updated: February 15, 2019, 4:16 PM IST
FAKE MI STORE: షావోమీ పేరుతో భారీ మోసం... మీరూ మోసపోకండి
FAKE MI STORE: షావోమీ పేరుతో భారీ స్కామ్... మీరూ మోసపోకండి
news18-telugu
Updated: February 15, 2019, 4:16 PM IST
షావోమీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. స్మార్ట్‌ఫోన్ల తర్వాత టెలివిజన్ మార్కెట్‌లోనూ షావోమీ సత్తా చాటుతోంది. మొదట్లో కేవలం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను మాత్రమే నమ్ముకున్న షావోమీ... ఆ తర్వాత ఆఫ్‌లైన్ మార్కెట్‌లో పట్టు సాధించేందుకు సొంతగా ఎంఐ స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. షావోమీ స్మార్ట్‌ఫోన్లకు, టీవీలకు డిమాండ్ ఉండటంతో ఎంఐ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు నేరగాళ్లు పెద్ద స్కెచ్చే వేశారు. షావోమీ ఇండియా ఎంఐ స్టోర్ ఫ్రాంఛైజీ ఇస్తామంటూ మోసాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఫేక్ ఎంఐ స్టోర్ల వలలో పడి చాలామంది మోసపోయారు. ఈ విషయం కాస్తా షావోమీ ఇండియా సీఈఓ మను జైన్‌కు తెలిసింది. ఆరా తీస్తే ప్రామిసరీ నోట్లు, సర్టిఫికెట్లు, అందులో మను జైన్ పేరుతో నకిలీ సంతకం బయటపడ్డాయి.

Loading...
ఇలాంటి మోసాలబారిన పడొద్దని షావోమీ ఇండియా సీఈఓ మను జైన్‌ హెచ్చరిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైనా ఎంఐ స్టోర్ ఫ్రాంఛైజీ పేరుతో సంప్రదిస్తే... స్థానికంగా ఉండే షావోమీ టీమ్‌ను సంప్రదించాలని, లేదా 1800 103 6286 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.


మరి ఎంఐ స్టోర్ ఫ్రాంఛైజీ ఇప్పిస్తామని మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే డబ్బులు చెల్లించి మోసపోకండి.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...
First published: February 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...