Home /News /technology /

XIAOMI VALENTINE AND MI SALE BEGINS WITH HUGE DISCOUNT OFFERS ON SMARTPHONES AND SMART TVS SS

Xiaomi Sale: వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్... రూ.5,000 వరకు డిస్కౌంట్

Xiaomi Sale: వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్... రూ.5,000 వరకు డిస్కౌంట్
(image: Xiaomi India)

Xiaomi Sale: వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్... రూ.5,000 వరకు డిస్కౌంట్ (image: Xiaomi India)

Valentines Day Sale | ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా షావోమీ ఇండియా డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. 'వాలెంటైన్ అండ్ ఎంఐ సేల్' (Valentine’s and Mi Sale) పేరుతో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లపై లభించే డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    షావోమీ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ఆడియో ప్రొడక్ట్స్, ఇతర స్మార్ట్ ప్రొడక్ట్స్‌పైనా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. సిటీ బ్యాంక్ (Citi Bank) కస్టమర్లు క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్ ద్వారా రూ.5,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక కొటక్ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. షావోమీ 'వాలెంటైన్ అండ్ ఎంఐ సేల్'లో రెడ్‌మీ 9ఐ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,619 ధరకే సొంసం చేసుకోవచ్చు. అసలు ధర రూ.8,799 కాగా ఏకంగా రూ.1,180 డిస్కౌంట్ లభిస్తోంది. ఇక రూ.7,299 విలువైన రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రూ.6,569 ధరకే లభిస్తోంది. ఈ సేల్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి రెడ్‌మీ నోట్ 11టీ 5జీ మొబైల్‌పై ఆఫర్ ఉంది. రూ.16,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,499 ధరకే కొనొచ్చు. ఇక రూ.14,999 విలువైన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.12,599 ధరకే లభిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.1,500 పొందొచ్చు.

    గతేడాది రిలీజై పాపులర్ అయిన రెడ్‌మీ నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.1,000 డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.16,999 ధరకే 6జీబీ+128జీబీ వేరియంట్ కొనొచ్చు. ఇక రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పైనా రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. ఆఫర్‌లో రూ.15,499 ధరకే కొనొచ్చు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే షావోమీ 11టీ ప్రో 5జీ మోడల్‌పై ఏకంగా రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. అసలు ధర రూ.39,999 కాగా, ఆఫర్‌లో రూ.34,499 ధరకే కొనొచ్చు. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.5,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.23,999 ధరకే లభిస్తోంది. దీంతో పాటు రూ.2,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

    Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉన్నవారికి ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్


    ఇక స్మార్ట్ టీవీల విషయానికి వస్తే షావోమీ స్మార్ట్ టీవీ 32 మోడల్ రూ.2,000 డిస్కౌంట్‌తో రూ.12,999 ధరకు, 43 అంగుళాల వేరియంట్ రూ.2,500 డిస్కౌంట్‌తో రూ.21,499 ధరకు, ఎంఐ టీవీ 5ఎక్స్ రూ.29,499 ధరకు లభిస్తోంది. రెడ్‌మీ బుక్ 15 ఇ-లెర్నింగ్ ఎడిషన్ రూ.35,499 ధర నుంచి ప్రారంభమైతే, రెడ్‌మీ 15 ప్రో రూ.44,999 ధరకు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.51,999. ఇక ఎంఐ నోట్‌బుక్ ప్రో రూ.54,499 ధరకు, ఎంఐ నోట్‌బుక్ అల్‌ట్రా రూ.57,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

    Redmi Note 11: రెడ్‌మీ నోట్ 11 సేల్ ఈరోజే... వారికి అదిరిపోయే ఆఫర్

    స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌‌టీవీ, ల్యాప్‌టాప్స్ మాత్రమే కాదు... స్మార్ట్ ప్రొడక్ట్స్ పైనా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 ఫిట్‌నెస్ బ్యాండ్ రూ.500 తగ్గింపుతో రూ.3,499 ధరకే కొనొచ్చు. ఇక ఎంఐ ఇయర్‌బడ్స్ 3 ప్రో టీడబ్ల్యూఎస్ రూ.3,000 డిస్కౌంట్‌తో రూ.2,999 ధరకు లభిస్తోంది. షావోమీ స్మార్ట్ బెడ్‌సైట్ ల్యాంప్, ఎంఐ స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్, ఎంఐ స్మార్ట్ ఎల్‌ఈడీ డెస్క్ ల్యాంప్ 1ఎస్, ఎంఐ స్మార్ట్ ఎల్ఈడీ బల్ప్ రూ.2,899 ధరకే కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Smart TV, Smartphone, Valentines day, Xiaomi, Xiaomi Mi TV

    తదుపరి వార్తలు