XIAOMI TV VS SHINCO SHINCO LAUNCHES 39 INCH HD LED TV IN INDIA AT RS 13990 WHICH SUPPORTS 4K PRICED LOWER THAN A XIAMI REDMI NOTE 7 PRO CR
కేవలం రూ.13,990లకే 39 అంగుళాల LED టీవీ... 4K టెక్నాలజీతో... మార్కెట్లోకి షింకో టీవీ...
షింకో స్మార్ట్ టీవీ (Photo: Amazon)
Shinco భారత మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోన్న చైనా టెలివిజన్ తయారీ దిగ్గజం... 24 అంగుళాల LED టీవీ ప్రారంభ ధర కేవలం రూ.6,490 మాత్రమే... Shinco SO4A 39 అంగుళాల LED టీవీ ధర కేవలం రూ.13,990 మాత్రమే.
భారతదేశాన్ని ఇన్నాళ్లు చైనా మొబైల్ కంపెనీలు దండెత్తాయి. చైనా మొబైల్ కంపెనీల పోటీనీ తట్టుకోలేక నోకియా, లావా, మైక్రోమాక్స్ వంటి ఎన్నో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్‌లోని టీవీ మార్కెట్‌పై చైనీస్ కంపెనీలు కన్నేశాయి. భారీ డిస్కౌంట్లతో, అద్భుతమైన ఆఫర్లతో స్మార్ట్ టీవీలను సగటు మధ్యతరగతి కుటుంబానికీ అందుబాటు ధరలో తీసుకువస్తున్నాయి. మొబైల్ కంపెనీ షామీ నుంచి ఎంఐ టీవీ 4 సిరీస్‌లను అతి తక్కువ ధరలో తీసుకురావడం ఇండియన్ టెలివిజన్ రంగంలో పెను సంచలనం క్రియేట్ చేసింది. MI LED Tv Pro 32 అంగుళాల ప్రారంభ ధర రూ.12,999 నుంచే లభ్యం కావడంతో మిగిలిన కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ‘జియో’ రాకతో మిగిలిన మొబైల్ సేవల కంపెనీలకు నష్టాలు మొదలైనట్టు, ఎంఐ రాకతో ఇన్నాళ్లు భారతదేశంలో ఓ వెలుగువెలిగిన శాంసంగ్, సోనీ వంటి టెలివిజన్ దిగ్గజాలకు గడ్డు కాలం మొదలవ్వబోతుందని టెక్ నిపుణులు కూడా అంచనాలు వేసేస్తున్నారు
షింకో LED టీవీ
తాజాగా మరో చైనా టెలివిజన్ తయారీ కంపెనీ Shinco భారత మార్కెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తోంది. అదిరిపోయే ధరల్లో అతిపెద్ద ఎల్ఈడీ టీవీలను భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. Shinco SO4A 39 అంగుళాల LED టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది కంపెనీ. 4K టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ HD రిజల్యూషన్ LED టీవీ ధర కేవలం రూ.13,990 మాత్రమే. 24 అంగుళాల LED టీవీ ప్రారంభ ధర కేవలం రూ.6,490 మాత్రమే. 65 అంగుళాల టీవీ ధర రూ.59,990గా ఉంది.
HD Resolutionతో పాటు రెండు HMDA పోర్టులు, రెండు USB పోర్టులు ఉండే ఈ టీవీ... USB టు USB ఫైల్ ట్రాన్స్ఫర్, 20W స్పీకర్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి. టీవీ కొన్న తర్వాత మరమ్మత్తులు వచ్చినా, సర్వీసింగ్‌లో, ఇన్‌స్టాలేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా ఫిర్యాదు చేసేందుకు Shinco ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా షింకో అందుబాటులోకి తెచ్చింది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ LED టీవీ SO42AS-E50 ధర రూ.16,450 మాత్రమే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.