Home /News /technology /

XIAOMI TV EA70 2022 PRICE CNY 3299 LAUNCH SALE DATE DECEMBER 31 SPECIFICATIONS GH VB

Mi TV EA70 2022: షియోమి నుంచి 70 అంగుళాల అతి పెద్ద స్మార్ట్​టీవీ లాంచ్​.. కొత్త ఫీచర్లతో అందుబాటు ధరల్లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షియోమి ఎంఐ టీవీ ఈఏ 70 2022 (Mi TV EA70) పేరుతో సరికొత్త స్మార్ట్​టీవీని చైనాలో లాంచ్​ చేసింది. దీనిలో 70 అంగుళాల అతి పెద్ద డిస్‌ప్లేను అందించడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోనే కాదు స్మార్ట్​టీవీ మార్కెట్​లోనూ దూసుకుపోతుంది. వరుసగా స్మార్ట్​టీవీలను లాంచ్​ చేస్తూ మార్కెట్​లో విస్తరిస్తోంది. తాజాగా షియోమి ఎంఐ టీవీ ఈఏ 70 2022 (Mi TV EA70) పేరుతో సరికొత్త స్మార్ట్​టీవీని చైనాలో లాంచ్​ చేసింది. దీనిలో 70 అంగుళాల అతి పెద్ద డిస్‌ప్లేను అందించడం విశేషం.

ఈ 4కే టీవీ 64- బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో రెండు స్టీరియో స్పీకర్లను కూడా అమర్చింది. ఇది 97.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కూడిన ప్రీమియం వన్-పీస్ 2ఎమ్ఎమ్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. దీనిలో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టమ్​ను అందించింది. ఈ షియోమి టీవీ బ్లూటూత్​ వాయిస్​ రిమోట్​ కంట్రోల్​తో వస్తుంది.

Narendra Modi: ప్రారంభమైన ఐఐటీ కాన్పూర్ 54వ కాన్వొకేషన్‌ సెర్మనీ.. పాల్గొన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే..


షియోమి ఎంఐ టీవీ ఈఏ70 2022 ధర, లభ్యత

షియోమి ఎంఐ టీవీ ఈఏ70 2022 స్మార్ట్​టీవీ చైనాలో CNY 3,299 (దాదాపు 38,800) వద్ద విడుదలైంది. ఇది చైనాలోని షియోమి ఆన్‌లైన్ స్టోర్ www.mi.comలో ప్రీఆర్డర్లకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 31 నుంచి చైనా మార్కెట్​లో అమ్మకానికి వస్తుంది. ఈ స్మార్ట్​టీవీ కేవలం బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

Flipkart 2021 Year End Sale: ప్రారంభమైన ఇయర్ ఎండ్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఆఫర్లు రెండు రోజులే..


షియోమి ఎంఐ టీవీ ఈఏ 70 2022 స్పెసిఫికేషన్లు

షియోమి ఎంఐ టీవీ ఈఏ 70 2022 స్మార్ట్​టీవీ176డిగ్రీల వ్యూయింగ్​ యాంగిల్​తో వస్తుంది. దీనిలో 60Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్​ బ్రైట్‌నెస్‌ గల 70- అంగుళాల డిస్‌ప్లేను అందించింది. ఈ స్మార్ట్​టీవీ మాలి జీపీయూతో కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 1.5 జీబీ ర్యామ్​, 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ను చేర్చింది. ఈ స్మార్ట్​టీవీ అప్‌గ్రేడ్ చేసిన ఎంఐయూఐపై రన్​ అవుతుంది. మరోవైపు, దీనిలో స్మార్టర్​ వాయిస్​ కంట్రోల్​, మినిమలిస్ట్​ మోడ్​లను కూడా చేర్చింది. తద్వారా వయస్సులో పెద్దవారు సైతం టీవీని సులభంగా ఆపరేట్​ చేయగలరు.

Narendra Modi: మోదీ కాన్వాయ్​లో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!


స్టాండ్​తో కలిపితే ఈ స్మార్ట్​టీవీ 19.5 కేజీల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే.. బ్లూటూత్​ వాయిస్​ రిమోట్​ కంట్రోల్, బ్లూటూత్​ వైఫై, ఇన్​ఫ్రారెడ్​ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను చేర్చింది. రెండు హెచ్​డీఎంఐ పోర్ట్​లు, ఒక ఏవీ పోర్టు, ఒక ఏటీవీ/డీటీఎంబీ పోర్టు, రెండు యూఎస్​బీ పోర్టులు, ఒక ఎస్​/పీడీఐఎఫ్​ పోర్టు, ఒక ఎథర్​నెట్​ పోర్టులను అందించింది. దీనిలో రెండు 10 వాట్స్​ స్పీకర్లు, డీటీఎస్​ హెచ్​డీ సపోర్ట్​ను కూడా చేర్చింది.
Published by:Veera Babu
First published:

Tags: Xiaomi Mi TV, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు