Mi Sale: సగం రేటుకే షావోమీ స్మార్ట్‌ఫోన్, టీవీ... నేడు ఒక్క రోజే ఫ్లాష్ సేల్

Mi Turns 5 sale | జూలై 25న చివరి రోజు సేల్ ఉంది. చివరి రోజు రెడ్‌మీ వై3 (3జీబీ+32 జీబీ) స్మార్ట్‌ఫోన్‌, ఎంఐ బిజినెస్ క్యాజ్యువల్ బ్యాక్‌ప్యాక్, ఎంఐ సౌండ్‌బార్, ఎంఐ 32 అంగుళాల టీవీలను సగం ధరకే అమ్ముతోంది షావోమీ.

news18-telugu
Updated: July 25, 2019, 5:17 AM IST
Mi Sale: సగం రేటుకే షావోమీ స్మార్ట్‌ఫోన్, టీవీ... నేడు ఒక్క రోజే ఫ్లాష్ సేల్
Mi Sale: సగం రేటుకే షావోమీ స్మార్ట్‌ఫోన్, టీవీ... రేపు ఒక్క రోజే ఫ్లాష్ సేల్ (image: Xiaomi)
news18-telugu
Updated: July 25, 2019, 5:17 AM IST
ఓ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి. మంచి టీవీ కొనాలంటే అంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టాలి. మరి అంత ధర ఉన్న టీవీ లేదా స్మార్ట్‌ఫోన్‌ను సగం రేటుకే కొనే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? షావోమీ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ఇది. షావోమీ 5వ వార్షికోత్సవం సందర్భంగా 'ఎంఐ టర్న్స్ 5' పేరుతో సేల్ నిర్వహిస్తోంది షావోమీ. ఈ సేల్‌లో కొన్ని ఉత్పత్తుల్ని సగం ధరకే అమ్ముతోంది షావోమీ. ఈ సేల్ రెండు రోజుల పాటు జరిగింది. జూలై 25న చివరి రోజు సేల్ ఉంది. చివరి రోజు రెడ్‌మీ వై3 (3జీబీ+32 జీబీ) స్మార్ట్‌ఫోన్‌, ఎంఐ బిజినెస్ క్యాజ్యువల్ బ్యాక్‌ప్యాక్, ఎంఐ సౌండ్‌బార్, ఎంఐ 32 అంగుళాల టీవీలను సగం ధరకే అమ్ముతోంది షావోమీ.

Mi Turns 5 sale: హాఫ్ ప్రైస్ సేల్ వివరాలివే...


జూలై 25న Small = Big sale పేరుతో హాఫ్ ప్రైస్ సేల్ నిర్వహించనుంది షావోమీ. అంటే సగం ధరకే వస్తువుల్ని అమ్మనుంది. జూలై 25 సాయంత్రం 4 గంటలకు జరిగే సేల్‌లో రూ.9,999 విలువైన రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.4999.50 ధరకే కొనొచ్చు. రూ.999 విలువైన ఎంఐ బిజినెస్ క్యాజువల్ బ్యాక్‌ప్యాక్‌ను రూ.499.50 ధరకు కొనొచ్చు. ఇక సాయంత్రం 6 గంటలకు జరిగే సేల్‌లో రూ.4,999 విలువైన సౌండ్‌బార్‌ను రూ.2499.50 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక రూ.12,999 విలువైన టీవీని రూ.6499.50 ధరకు కొనొచ్చు. ఇవన్నీ ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది షావోమీ. కాబట్టి ఈ ఫ్లాష్ సేల్ కొన్ని సెకన్లలోనే ముగిసిపోతుంది. షావోమీ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ వీటిని కొనొచ్చు.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:



Travel Insurance: టూర్ వెళ్తున్నారా? ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌తో లాభాలివే...
Loading...
Netflix: గుడ్ న్యూస్... రూ.199 ధరకే నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి కేరళ, తమిళనాడు టూర్... ప్యాకేజీ వివరాలివే
First published: July 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...