Redmi 9: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి

Redmi 9 Series Smartphones | షావోమీ నుంచి త్వరలో రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండుమూడు నెలల్లోనే షావోమీ కొత్త ఫోన్లను పరిచయం చేయొచ్చు.

news18-telugu
Updated: February 5, 2020, 4:42 PM IST
Redmi 9: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి
Redmi 9: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. షావోమీ నుంచి రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. గత కొన్నినెలలుగా రెడ్‌మీ 8 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. రెడ్‌మీ 8ఏ, రెడ్‌మీ 8, రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి అప్‌గ్రేడ్ వర్షన్ రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు త్వరలో రిలీజ్ అయ్యే అవకాశముంది. రెడ్‌మీ 9 సిరీస్‌లో రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 9 నోట్ 9 ప్రో మోడల్స్ ఉండొచ్చని అంచనా. రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా షావోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ట్విట్టర్‌లో టీజర్లు కనిపిస్తున్నాయి. ఈ టీజర్లు త్వరలో రిలీజ్ కాబోయే రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించినవే అన్న చర్చ జరుగుతోంది. #MorePowerToRedmi హ్యాష్ ట్యాగ్‌తో టీజర్ వీడియో షావోమీ ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుతోంది. వీడియోలో కమింగ్ సూన్ అని ఉండటంతో రెడ్‌మీ 9 సిరీస్ గురించేనని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.


గతేడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య రెడ్‌మీ 7 సిరీస్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ రెండుమూడు నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఓవైపు రియల్‌మీ, మరోవైపు రెడ్‌మీ పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియల్‌మీ 5 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మరి రెడ్‌మీ 9 సిరీస్‌కు పోటీగా రియల్‌మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వస్తాయేమో చూడాలి. ఇప్పటికే రియల్‌మీ ఎక్స్‌2 మోడల్‌కు పోటీగా షావోమీ సబ్‌బ్రాండ్ పోకో ఇండియా పోకో ఎక్స్‌2 రిలీజ్ చేసింది. పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Poco X2 vs Realme X2: పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్

Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్
First published: February 5, 2020, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading