Redmi 9A: రేపే రెడ్‌మీ 9ఏ రిలీజ్... ధర రూ.7,000 లోపే

Redmi 9A | తక్కువ బడ్జెట్‌లో మరో స్మార్ట్‌‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది షావోమీ. ఫిబ్రవరి 11న రెడ్‌మీ 9ఏ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

news18-telugu
Updated: February 10, 2020, 3:23 PM IST
Redmi 9A: రేపే రెడ్‌మీ 9ఏ రిలీజ్... ధర రూ.7,000 లోపే
Redmi 9A: ఫిబ్రవరి 11న రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ప్రత్యేకతలివే (image: Redmi India)
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. రెడ్‌మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఫిబ్రవరి 11న రెడ్‌మీ 9ఏ రిలీజ్ చేయబోతున్నట్టు షావోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది షావోమీ రిలీజ్ చేస్తున్న తొలి ఫోన్ ఇదే. అంతేకాదు... రెడ్‌మీ నుంచి మరో పవర్ బ్యాంక్ కూడా రిలీజ్ కానుంది. గతేడాది రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది షావోమీ. ఇప్పటికీ ఈ ఫోన్‌కు మంచి డిమాండే ఉంది. ఇప్పుడు రెడ్‌మీ 8ఏ అప్‌గ్రేడ్ వర్షన్‌ రెడ్‌మీ 9ఏ మోడల్‌ను రిలీజ్ చేయబోతోంది షావోమీ. #DeshKaDumdaarSmartphone పేరుతో రెడ్‌మీ 9ఏ గురించి చెబుతోంది షావోమీ. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేవీ ఇంకా తెలియలేదు. కానీ... 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంటుందని షావోమీ క్లారిటీ ఇచ్చింది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్‌మీ, షావోమీ పోటాపోటీగా మోడల్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. వెంటనే షావోమీ కొత్త ఫోన్‌ను ప్రకటించింది. రెడ్‌మీ 9ఏ మోడల్‌తో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌కు పోటీ ఇవ్వనుంది షావోమీ. అయితే రెడ్‌మీ 9ఏ రిలీజ్ అయ్యాక ఫీచర్లు చూస్తే వీటిలో ఏది బెస్ట్ ఫోన్ కావచ్చో తేలుతుంది. అప్పటివరకు సస్పెన్సే.

ఇవి కూడా చదవండి:

Realme C3: రిలీజైన రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్‌బీఐ షాక్

ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు తీసుకోవచ్చు ఇలా
First published: February 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు