షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. 'స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్' పేరుతో రెడ్మీ 7ఏ రిలీజ్ చేయబోతోంది షావోమీ. జూలై 4న ఈ ఫోన్ ఇండియాలో అధికారికంగా రిలీజ్ కానుంది. రెడ్మీ 7ఏ స్మార్ట్‌ఫోన్ విషయాన్ని ప్రపంచానికి మొదట ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే లిస్టింగ్‌లో రెడ్మీ 7ఏ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలేవీ లేవు. ఇప్పటికే ఇండియాలో రెడ్మీ 4ఏ, రెడ్మీ 5ఏ, రెడ్మీ 6ఏ పేరుతో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. ఇటీవల రెడ్మీ 7 సిరీస్ ఫోన్లను వరుసగా లాంఛ్ చేసిన షావోమీ... ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన రెడ్మీ 7ఏ తీసుకురానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంఛైంది.
#Redmi4A, #Redmi5A, & #Redmi6A all featured a quadcore processor. With the #Redmi7A we will take it a step further. 👍
Can you guess the processor on this #SmartDeshKaSmartphone? 🤔
Share your guesses now!😊 pic.twitter.com/VgPI32Yw8Q
— Manu Kumar Jain (@manukumarjain) July 1, 2019
రెడ్మీ 7ఏ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 5.45 అంగుళాలు, 720 x 1440 పిక్సెల్స్
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్-నానో
కలర్స్: బ్లాక్, బ్లూ
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూడా చదవండి:
Realme X: బీ రెడీ... 'రియల్మీ ఎక్స్' ఇండియాకు వచ్చేస్తోంది
Tata Sky: టాటాస్కై సెట్-టాప్ బాక్సుల ధరలు తగ్గాయి
Realme C2: ఎక్స్ఛేంజ్లో రూ.99 ధరకే రియల్మీ సీ2 స్మార్ట్‌ఫోన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Flipkart, Redmi, Smartphone, Xiaomi