Redmi Go: రిలీజైన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో 'రెడ్‌మీ గో' సేల్... ధర రూ.4,000 లోపే

Redmi Go | మార్చి 19న ఇండియాలో అధికారికంగా రిలీజ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో 'రెడ్‌మీ గో' సేల్ ప్రారంభం కానుంది. ధర రూ.5,000 లోపు ఉంటుందని మొదట వార్తలొచ్చినా... రూ.4,000 కన్నా తక్కువకే మార్కెట్లోకి రానుందని తాజా సమాచారం.

news18-telugu
Updated: March 19, 2019, 2:35 PM IST
Redmi Go: రిలీజైన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో 'రెడ్‌మీ గో' సేల్... ధర రూ.4,000 లోపే
Redmi Go: రిలీజైన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో 'రెడ్‌మీ గో' సేల్... ధర రూ.4,000 లోపే
news18-telugu
Updated: March 19, 2019, 2:35 PM IST
కొద్ది రోజుల క్రితం షావోమీ ప్రకటించిన ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో' మార్చి 19న అధికారికంగా రిలీజ్ కానుంది. 'రెడ్‌మీ గో' బేసిక్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్‌కు చెందిన లైట్‌వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ గో'తో పనిచేస్తుంది 'రెడ్‌మీ గో'. ఇందులో మ్యాప్స్ గో, యూట్యూబ్ గో లాంటి లైట్‌వెయిట్ యాప్స్ ఉంటాయి. మిగతా స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ధర కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. ఇప్పటికే విదేశాల్లో లాంఛ్ అయిన 'రెడ్‌మీ గో' బేసిక్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయితే లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మార్చి 19న ఇండియాలో అధికారికంగా రిలీజ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో 'రెడ్‌మీ గో' సేల్ ప్రారంభం కానుంది. ధర రూ.5,000 లోపు ఉంటుందని మొదట వార్తలొచ్చినా... రూ.4,000 కన్నా తక్కువకే మార్కెట్లోకి రానుందని తాజా సమాచారం.

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్
ర్యామ్: 1 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
Loading...
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, రెడ్, బ్లాక్
ధర: సుమారు రూ.4,000 ఉంటుందని అంచనా

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

Redmi 7: షావోమీ నుంచి మరో ఫోన్... చైనాలో రిలీజైన రెడ్‌మీ 7

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...