మీకు మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమా? మంచి ఫోటోలు తీసేందుకు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? 48, 64 కాదు... ఏకంగా 108 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ఇటీవల చైనాలో రిలీజైన ఎంఐ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొస్తోంది షావోమీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కంపెనీ. ప్రపంచంలోనే తొలి 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అని షావోమీ చెబుతోంది. షావోమీ నుంచి 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. త్వరలో ఇండియాకు 108 మెగాపిక్సెల్ రాబోతోంది. అయితే ఏ రోజున ఈ ఫోన్ రిలీజ్ కానుందో స్పష్టత లేదు. ఎంఐ నోట్ 10 ఇప్పటికే చైనాలో రిలీజ్ కావడంతో ఫీచర్లు తెలిసినవే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు ఏకంగా 5 కెమెరాలు ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ ఉండటం మరో విశేషం. 5260 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
📸 📸📸📸📸 📸📸📸📸
📸 📸 📸 📸 📸
📸 📸 📸 📸 📸
📸 📸 📸 📸📸📸📸
I T' S C O M I N G #108MP
📸 📸 📸 📸 📸
📸 📸 📸 📸 📸
📸 📸📸📸📸 📸📸📸📸
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.