చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం షావోమీరెడ్మీ నోట్ 11 సిరీస్ (Redmi Note 11 Series) ఫోన్లను విడుదల చేయనుంది. అక్టోబర్ 28న నిర్వహించనున్న షావోమీ ఈవెంట్లో ఈ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ లాంచింగ్ ఈవెంట్ చైనాలో అక్టోబర్ 28 న రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా షావోమీ విడుదల చేసింది. రెడ్మీ నోట్ 11 సిరీస్ ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగానే ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 (Redmi Note 11), రెడ్మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro), రెడ్మీ నోట్ 11 ప్రో+ (Redmi Note 11 Pro+) స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు ధ్రువీకరించాయి.
రెడ్మీ నోట్ 11 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
చైనా టెక్ బ్లాగ్ సినా వీబో వివరాల ప్రకారం.. 5జీ రెడ్మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్, మెరుగైన ఫీచర్లు, సూపర్ పవర్ ఎఫిషెన్సీ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందించింది. 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 120 హెచ్డీ AMOLED డిస్ప్లేను చేర్చింది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాక్ సినావిబో పేర్కొంది.
6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల రెడ్మీ నోట్ 11 ప్రో 5జీ ఫోన్ చైనాలో భారత కరెన్సీ ప్రకారం రూ. 18,600 వద్ద విడుదల కానుంది. 8 జీబీ ర్యామ్ ఆప్షన్‌తో కూడిన 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్వేరియంట్ల ధరలు వరుసగా రూ. 21,000 నుంచి రూ. 23,300 వరకు ఉండనున్నాయి.
రెడ్మీ నోట్ 11 5జీ స్పెసిఫికేషన్లు
రెడ్మీ నోట్ 11 5జీ స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇక, 120 హెర్ట్జ్ అమో ఎల్ఈడీ డిస్ప్లేను చేర్చింది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఇది 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో వస్తుంది.
రెడ్మీ నోట్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,000, 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ రూ. 18,600 వద్ద లభిస్తుందని చైనా టెక్ బ్లాక్ సినా వీబో తన కథనంలో పేర్కొంది. ఈ మోడల్స్ అన్నీ మిస్టీరియస్ బ్లాక్‌ల్యాండ్, మిస్టీ ఫారెస్ట్, షాలో మెంగ్ జింఘి, టైమ్ క్వైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.