Xiaomi Loan: అప్పులు ఇవ్వనున్న షావోమీ... వడ్డీ రూ.2 లోపే

Xiaomi Mi Credit Service | ఇప్పటికే Mi Pay మొబైల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది షావోమీ. త్వరలో Mi Credits యాప్‌తో ఇండియాలో అప్పులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

news18-telugu
Updated: August 26, 2019, 12:33 PM IST
Xiaomi Loan: అప్పులు ఇవ్వనున్న షావోమీ... వడ్డీ రూ.2 లోపే
Xiaomi Loan: అప్పులు ఇవ్వనున్న షావోమీ... వడ్డీ రూ.2 లోపే (షావోమీ)
  • Share this:
షావోమీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఓ సంచలనం. మొదటి స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన మూడేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది షావోమీ. మొబైల్స్ మాత్రమే కాదు... టీవీలు, ఎయిర్ ప్యూరిఫైర్స్, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్ లాంటి మొబైల్ యాక్సెసరీస్... ఇలా కొత్తకొత్త ప్రొడక్ట్స్‌తో ఇండియన్ మార్కెట్‌లోకి విస్తరిస్తోంది షావోమీ. అంతటితో ఆగట్లేదు... త్వరలో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. కన్స్యూమర్ లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. అంటే యూజర్లకు అప్పులు ఇచ్చే సంస్థగా మారనుంది. షావోమీకి చెందిన Mi Credits యాప్ ద్వారా అప్పులు ఇవ్వనుంది. ఇప్పటికే Mi Pay మొబైల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది షావోమీ. త్వరలో Mi Credits యాప్‌తో ఇండియాలో అప్పులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

షావోమీకి చెందిన ఎంఐ క్రెడిట్ సర్వీస్ ద్వారా యూజర్లకు ఒక్కొక్కరికీ రూ.1,00,000 వరకు లోన్ ఇవ్వనుంది కంపెనీ. వడ్డీ రేట్లు 1.8 శాతం నుంచి ప్రారంభమౌతాయి. అంటే రూ.2 లోపే. మరికొన్ని వారాల్లో ఇండియాలో షావోమీ లోన్ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీటా ఫేజ్‌లో ఈ సర్వీస్ ప్రారంభమైంది. బీటా ఫేజ్ సక్సెస్ అయితే త్వరలోనే Mi Credit యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో ఇప్పటికే ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ అనేకం ఉన్నాయి. ఇప్పుడు వాటికి పోటీగా షావోమీ వస్తోంది. మరి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించినట్టు ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్‌లో కూడా షావోమీ సంచలనాలు ఏవైనా ఉంటాయా అన్నది చూడాలి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

New Smartphone: 4 రోజుల్లో 4 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... వీటిలో ఏది బెటర్?

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిSmartphone Camera: మీ స్మార్ట్‌ఫోన్‌కి కెమెరా ఎంత అవసరమో తెలుసా?
First published: August 26, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading