• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI TO LAUNCH MORE SMARTPHONES WITH 108 MEGAPIXEL SENSORS SS GH

Xiaomi: 108MP సెన్సార్లతో షావోమీ నుంచి మరిన్ని స్మార్ట్‌ఫోన్స్

Xiaomi: 108MP  సెన్సార్లతో షావోమీ నుంచి మరిన్ని స్మార్ట్‌ఫోన్స్

Xiaomi: 108MP సెన్సార్లతో షావోమీ నుంచి మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ (image: Xiaomi Logo)

Xiaomi | షావోమీ ఇటీవల 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 108 మెగాపిక్సెల్ కెమెరాతో మరిన్ని స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుంది షావోమీ.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షావోమీ ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లను అందిస్తూ భారతీయ మార్కెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది షావోమీ. అందుకే, షావోమీ బ్రాండ్‌కు దేశంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. తాజాగా, భారత మార్కెట్లోకి షావోమీ విడుదల చేసిన ఎంఐ 10 ఐ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. సరసమైన ధరలోనే 5జీ టెక్నాలజీతో పాటు 1‌08 ఎంపి సెన్సార్‌ను అందించడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇదే స్పీడ్‌లో 108 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన మరిన్ని స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు షావోమీ జనరల్ మేనేజర్ లు వీబింగ్ స్పష్టం చేశారు.

Realme X7 5G: రిలీజ్‌కు ముందే లీకైన ధరలు... రియల్‌మీ ఎక్స్7 5జీ ప్రైస్ ఇదే

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరో సేల్... రూ.30,000 లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే

ప్రస్తుతం మార్కెట్లో వివిధ మొబైల్ తయారీ కంపెనీలు విడుదల చేస్తున్న మిడ్రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో 64 ఎంపి సెన్సార్లను మాత్రమే వాడుతున్నారు. అయితే, షావోమీ మాత్రం అదే ధరలో108 ఎంపి సెన్సార్‌తో కూడిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ అన్ని మొబైల్ కంపెనీలకు షాకిస్తుంది. అంతేకాదు, షావోమీ నుంచి విడుదల కానున్న అన్ని మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లలోనూ 108 ఎంపి సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షావోమీ జనరల్ మేనేజర్ లు వీబింగ్ మాట్లాడుతూ ‘‘మొబైల్ మార్కెట్లో ఉన్న అనేక బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లలో మెరుగైన సెన్సార్లను అందించడంలో విఫలమయ్యాయి. దీన్ని గుర్తించే, మా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లలోనే 108 ఎంపి సెన్సార్లను అందిస్తున్నాం. రాబోయే కాలంలో షావోమీ నుంచి వచ్చే మరిన్ని స్మార్ట్‌ఫోన్లలో కూడా 108 సెన్సార్ను ఉపయోగించనున్నాం.” అని అన్నారు. కాగా, ఈ సెన్నార్లను టోఫ్ సెన్సార్లు అని కూడా పిలుస్తారు. టోఫ్ అనగా “టైమ్ ఆఫ్ ఫ్లైట్” సెన్సార్లు అని అర్థం. ఈ సెన్సార్లు ఇన్ఫ్రారెడ్ లైట్ను ఉపయోగించుకొని పిక్చర్ డెప్త్ను అంచనా వేస్తాయి. దీంతో, మనం తీసే ఫోటోలపై బ్లర్ ప్రభావం తగ్గి, ఫోటోలు మంచి క్వాలిటీతో వస్తాయి. అయితే, వీటిని ప్రధానంగా AR, 3D ఇమేజింగ్ కోసం ఉపయోగిస్తారు.

Poco M2: నిమిషానికి 5 ఫోన్లు కొనేస్తున్నారు... ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే

WhatsApp Groups: మీకు చెప్పకుండా వాట్సప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్స్‌తో బ్రేక్ వేయండి

108 ఎంపి సెన్సార్ ఉపయోగిస్తున్న ఏకైక బ్రాండ్..


కాగా, శామ్‌సంగ్, హువావే సంస్థలు కూడా తామ ఫ్లాగ్‌షిప్‌ మొబైళ్లలో టోఫ్ సెన్సార్లనే ఉపయోగిస్తున్నాయి. అయితే, వీటి ధర ఎక్కువగా ఉంటుంది. కానీ, షావోమీ తక్కువ ధరలోనే 108 ఎంపి సెన్సార్తో స్మార్ట్ఫోన్లను విడుదల చేయడం విశేషం. షావోమీ నుంచి విడుదలైన ఎంఐ నోట్ 10లో మొట్టమొదటి సారిగా 108 సెన్సార్‌ను ఉపయోగించారు. ఐదు సెన్సార్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2019 చివరిలో లాంచ్ చేసింది. దీంతో పాటు, షావోమీ ఇటీవల చైనాలో విడుదల చేసిన 5 జి స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 9 ప్రోలో కూడా ఇదే సెన్సార్ను ఉపయోగించారు. ఈ ధరల శ్రేణిలో 108MP సెన్సార్‌ అందిస్తున్న ఏకైక బ్రాండ్ షావోమీ కావడం విశేషం. తాజాగా భారత మార్కెట్లో విడుదలైన షావోమీ ఎంఐ10 ఐలో కూడా 108 ఎంపి సెన్సార్ను ఉపయోగించారు. షావోమీ నుంచి రాబోయే మరిన్ని స్మార్ట్ఫోన్లలో కూడా 108 ఎంపి సెన్సార్లను ఆశించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు