• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI TO LAUNCH MI 11 ULTRA MI 11X PRO AND MI 11X SMARTPHONES TOMORROW IN INDIA KNOW EXPECTED PRICE AND SPECIFICATIONS SS

Mi 11 Series: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు... ఈ ప్రీమియం ఫోన్ల ప్రత్యేకత ఏంటంటే

Mi 11 Series: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు... ఈ ప్రీమియం ఫోన్ల ప్రత్యేకత ఏంటంటే

Mi 11: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు... ఈ ప్రీమియం ఫోన్ల ప్రత్యేకత ఏంటంటే (image: Xiaomi India)

Mi 11 Series | ఎంఐ 11 సిరీస్‌లో ఒకే రోజు మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయనుంది షావోమీ ఇండియా. ఈ ప్రీమియం ఫోన్ల ప్రత్యేకత, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. షావోమీ ఇండియాలో ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేయనుంది. ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో లాంఛ్ కానున్నాయి. మొదట ఇండియాలో ఎంఐ 11 అల్‌ట్రా మాత్రమే లాంఛ్ అవుతుంది అనుకున్నారు. కానీ షావోమీ ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడళ్లను కూడా పరిచయం చేయనుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్లు ఉండటం విశేషం. మూడూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లే. వీటి ధరలు ఎంత ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఎంఐ 11 అల్‌ట్రా ధర ఎక్కువగా ఉండొచ్చని, ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో ధరలు కాస్త తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఎంఐ 11 అల్‌ట్రా అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని షావోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

    Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి


    ఎంఐ 11 అల్‌ట్రా చైనాలో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ కాబట్టి స్పెసిఫికేషన్స్ తెలిసినవే. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. 6.81 అంగుళాల అమొలెడ్ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండటం విశేషం. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో సెన్సార్ + 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. చైనాలో ఎంఐ 11 అల్‌ట్రా 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మరి ఇండియాలో ఏఏ వేరియంట్లు రిలీజ్ అవుతాయో తెలియదు. ఎంఐ11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ ధర రూ.70,000 పైనే ఉండొచ్చని అంచనా.

    Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి

    Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి


    ఇక ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇవి రెడ్‌మీ కే40, రెడ్‌మీ కే40 ప్రో రీబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు అన్న ప్రచారం జరుగుతోంది. వీటిలో 6.67 అంగుళాల సూపర్ అమొలెడ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుందని అంచనా. దీంతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 4,250ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఎంఐ 11ఎక్స్ ధర రూ.30,000 లోపు ఉంటుందని, ఎంఐ 11ఎక్స్ ప్రో ధర రూ.37,000 ఉంటుందని అంచనా.
    Published by:Santhosh Kumar S
    First published: