Redmi Note 7S: రేపే రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ప్రత్యేకతలివే

Redmi Note 7S | రెడ్‌మీ నోట్ 7 సిరీస్‌ ఫోన్లలో ఉన్న గ్రేడియంట్ ఫినిష్, డాట్ డ్రాప్ నాచ్, గ్లాస్ బాడీ లాంటి ఫీచర్లు రెడ్‌మీ నోట్ 7ఎస్‌లో కూడా ఉంటాయని అంచనా.

news18-telugu
Updated: May 19, 2019, 6:16 PM IST
Redmi Note 7S: రేపే రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ప్రత్యేకతలివే
Redmi Note 7S: షావోమీ నుంచి మరో ఫోన్... రెడ్‌మీ నోట్ 7ఎస్ (image: Xiaomi)
news18-telugu
Updated: May 19, 2019, 6:16 PM IST
షావోమీ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న రెడ్‌మీ 7ఎస్ సోమవారం రిలీజ్ కానుంది. ఇప్పటికే రెడ్‌మీ 7, రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పుడు రెడ్‌మీ 7 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 7ఎస్ తీసుకొచ్చేస్తోంది. షావోమీ నుంచి నోట్ S సిరీస్‌లో తొలి ఫోన్ ఇది. రెడ్‌మీ నోట్ 7ఎస్ 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. వెనుకవైపు డ్యుయెల్ కెమెరా ఉండటం విశేషం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియవు. అయితే రెడ్‌మీ నోట్ 7 సిరీస్‌ ఫోన్లలో ఉన్న గ్రేడియంట్ ఫినిష్, డాట్ డ్రాప్ నాచ్, గ్లాస్ బాడీ లాంటి ఫీచర్లు రెడ్‌మీ నోట్ 7ఎస్‌లో కూడా ఉంటాయని అంచనా.

Loading...
ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 7 ధర ప్రారంభ ధర రూ.9,999 కాగా, హైఎండ్ మోడల్ ధర రూ.11,999. ఇక రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రారంభ ధర రూ.13,999 కాగా, హైఎండ్ మోడల్ ధర రూ.16,999. రెడ్‌మీ నోట్ 7ఎస్ ధర ఎంత అన్నది రిలీజ్ రోజే తేలనుంది. ఇక ఇప్పటికే ఫ్లాగ్‌షిప్ కిల్లర్ రెడ్‌మీ కే20 రిలీజ్ చేస్తామని ప్రకటించింది. దీంతో పాటు స్నాప్‌డ్రాగన్ 730 ఫోన్ కూడా తీసుకురానుంది. ఇది ఎంఐ ఏ3 కావచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు పోకో ఎఫ్ సిరీస్‌లో పోకో ఎఫ్2 కూడా రానుంది.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...

Aadhaar: ఆధార్ కార్డు వాడట్లేదా? డీయాక్టివేట్ అయిపోతుంది
First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...