హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్

Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్

Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్
(image: Xiaomi)

Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ (image: Xiaomi)

Xiaomi Mi Note 10 | 'ప్రపంచంలోనే తొలి 108 మెగాపిక్సెల్ పెంటా కెమెరా స్మార్ట్‌‌ఫోన్ ఎంఐ నోట్ 10' అంటూ ఇప్పటికే షావోమీ ట్వీట్ చేసింది.

  షావోమీ... స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలకు కేంద్ర బిందువు. ఇండియన్ మార్కెట్‌లోనే కాదు... గ్లోబల్ మార్కెట్‌లోనూ షావోమీ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు మరో సంచలనానికి షావోమీ రంగం సిద్ధం చేసింది. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే షావోమీ నుంచి 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ తీసుకురాబోతోంది. 108 మెగాపిక్సెల్ సాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌తో మొత్తం పెంటా-కెమెరా సెటప్‌తో ఎంఐ నోట్ 10 రిలీజ్ చేయనుంది షావోమీ. పెంటా కెమెరా సెటప్ అంటే మొత్తం 5 రియర్ కెమెరాలుంటాయి. ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అదే ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు ఎంఐ నోట్ 10 పేరుతో షావోమీ పరిచయం చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. 'ప్రపంచంలోనే తొలి 108 మెగాపిక్సెల్ పెంటా కెమెరా స్మార్ట్‌‌ఫోన్ ఎంఐ నోట్ 10' అంటూ ఇప్పటికే షావోమీ ట్వీట్ చేసింది.

  ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ నవంబర్ 5న చైనాలో లాంఛ్ కానుందని గతంలోనే ప్రకటించింది షావోమీ. దాంతో పాటు ఎంఐ మిక్స్ ఆల్ఫా కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ నోట్ 10 పేరుతో రీబ్రాండ్ చేసి గ్లోబల్ ఆడియన్స్‌కు షావోమీ పరిచయం చేసే అవకాశముంది. షావోమీ ఎంఐ నోట్ 10 స్పెసిఫికేషన్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. 6.4 అంగుళాల అమొలెడ్ ప్యానెల్, వెనుక వైపు 5 కెమెరాలు, అందులో ఒకటి 108 మెగాపిక్సెల్ సాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌, 5x ఆప్టికల్ జూమ్, క్లాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్, 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా.

  Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు

  WhatsApp: మీ వాట్సప్‌ని అద్భుతంగా మార్చే 5 ఫీచర్లు ఇవే

  WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఇవే లాభాలు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Smartphone, Xiaomi

  ఉత్తమ కథలు