Fast Charging: స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ 17 నిమిషాల్లో... షావోమీ కొత్త టెక్నాలజీ

Xiaomi's 100W Fast Charging Solution | షావోమీ రూపొందించిన టెక్నాలజీతో 0-100 శాతానికి ఛార్జింగ్ 17 నిమిషాల్లో కాగా, అంతే సమయంలో ఒప్పో టెక్నాలజీతో కేవలం 65 శాతం ఛార్జింగ్ కావడం విశేషం.

news18-telugu
Updated: March 26, 2019, 9:08 PM IST
Fast Charging: స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ 17 నిమిషాల్లో... షావోమీ కొత్త టెక్నాలజీ
Fast Charging: స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ 17 నిమిషాల్లో... షావోమీ కొత్త టెక్నాలజీ
  • Share this:
ఒక స్మార్ట్‌ఫోన్ ఎంతసేపట్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది? సాధారణంగా గంటన్నర నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్‌పైన ఆధారపడి ఉంటుంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందిస్తోంది. దీంతో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్ 17 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ అవుతుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ఇది. 20V/5A కెపాసిటీ ఛార్జర్‌తో కేవలం 17 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జింగ్ కావడం విశేషం. వీడియో చూడండి.


షావోమీ అధ్యక్షుడు లిన్ బిన్ వీబోలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఒప్పో రూపొందించిన 50W ఛార్జింగ్ సొల్యూషన్‌తో పోల్చి చూపించిన వీడియో ఇది. షావోమీ రూపొందించిన టెక్నాలజీతో 0-100 శాతానికి ఛార్జింగ్ 17 నిమిషాల్లో కాగా, అంతే సమయంలో ఒప్పో టెక్నాలజీతో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ 65 శాతం ఛార్జింగ్ అయింది. ప్రపంచంలో మొట్టమొదటి 100W ఛార్జర్ ఇది. షావోమీ తీర్చిదిద్దిన సరికొత్త ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూడా చదవండి:

IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు

TRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్

NTA UGC NET 2019: యూజీసీ నెట్‌ పాసైతే 5 లాభాలు ఇవే... మార్చి 30 చివరి తేదీ
First published: March 26, 2019, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading